ఫిక్స్‌డ్‌ డ్యూటీకి.. మోక్షమెప్పుడో..?

ABN , First Publish Date - 2022-09-27T06:53:08+05:30 IST

ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేయడంలో ఘనత వహించిన సంస్థగా ఏపీఎస్‌ఆర్టీసీకి ప్ర త్యేకత ఉంది. బస్సులోని ప్రయాణికులను గౌరవంగా పలకరించడంతో.. సమయపాల పాటించడంలో.. బస్సుల పరిశుభ్రతలో.. ఆర్టీసీ ఉద్యోగుల తీరు ప్రత్యేకం. ఇటువంటి ప్రజాసేవతో కూడిన వ్యాపార సంస్థను లాభాల్లోకి తీసుకువచ్చేందకు వీలుగా గతంలోనే ఉన్నతాధికారులు మూడు ప్రధాన నియమాలను కచ్చితంగా పాటించాలని తగిన ఆదేశాలిచ్చారు.

ఫిక్స్‌డ్‌ డ్యూటీకి.. మోక్షమెప్పుడో..?

  • మూడేళ్లకు పైగా ఫిక్స్‌డ్‌ చార్ట్‌కు నోచుకోని వైనం
  • ఇబ్బంది పడుతున్న డ్రైవర్లు, కండక్టర్లు
  • చోద్యం చూస్తున్న ఆర్టీసీ అధికారులు

తుని, సెప్టెంబరు 26: ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేయడంలో ఘనత వహించిన సంస్థగా ఏపీఎస్‌ఆర్టీసీకి ప్ర త్యేకత ఉంది. బస్సులోని ప్రయాణికులను గౌరవంగా పలకరించడంతో.. సమయపాల పాటించడంలో.. బస్సుల పరిశుభ్రతలో.. ఆర్టీసీ ఉద్యోగుల తీరు ప్రత్యేకం. ఇటువంటి ప్రజాసేవతో కూడిన వ్యాపార సంస్థను లాభాల్లోకి తీసుకువచ్చేందకు వీలుగా గతంలోనే ఉన్నతాధికారులు మూడు ప్రధాన నియమాలను కచ్చితంగా పాటించాలని తగిన ఆదేశాలిచ్చారు. ఆ మేరకు ఫిక్స్‌డ్‌ బస్‌(ఒక రూటుకు ఒక బస్సు), ఫిక్స్‌డ్‌ డ్రైవర్‌, కండక్టర్‌, ఫిక్స్‌డ్‌ చార్టు(ఎంపిక చేసిన ఉద్యోగుల జాబితా) ఉండాలని అప్పట్లోనే నిర్ణయించారు. దీన్నే ఫిక్స్‌డ్‌ డ్యూటీ చార్ట్‌ అంటారు. ఇది చాలా ఏళ్లుగా అమలులో ఉండేది. వైసీ పీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్లుగా ఫిక్స్‌డ్‌ చార్ట్‌ డ్యూటీలు ఆర్టీసీలో అమలు కావడం లేదు. దీంతో సంస్థకు మరింత నష్టం వాటిల్లుతోందనే విమర్శలున్నాయి. గతంలో ప్రతిఏటా ఉద్యోగులకు (డైవర్లు, కండక్టర్లకు) కొత్త చార్ట్‌ వేసేవారు. కరోనా కారణంగా ఖాళీ లు ఏర్పడిన దృష్ట్యా ఉద్యోగుల్లో అశాంతి నెలకొన్నట్లు సమాచారం.

ఫిక్స్‌డ్‌ డ్యూటీ చార్ట్‌ ఉపయోగాలు..

ఫిక్స్‌డ్‌ డ్యూటీ చార్ట్‌ వేయడంవల్ల ఉద్యోగులకు(కండక్టర్లు, డ్రైవర్ల కు) ఆయా రూట్‌ల మీద పూర్తి అవగాహన ఉంటుంది. దీంతో ఏ స మయంలో ఎక్కడ ప్రయాణికులు రద్దీగా ఉంటారో పసిగట్టి బస్‌ స ర్వీసు తిప్పుతూ అత్యధిక కలెక్షన్‌ రాబట్టే వీలుంటుంది. తద్వారా సం స్థ పురోగతిని దృష్టిలో ఉంచుకునే ఉన్నతాధికారులు గతంలోనే ఫిక్స్‌ డ్‌చార్ట్‌లు, ఫిక్స్‌డ్‌ డ్యూటీలు, ఫిక్స్‌డ్‌ రూట్స్‌ రూపొందించారు. ఆ ని బంధనలు పాటించకుండా వాటికి తిలోదకాలిచ్చిన కారణంగా సంస్థకు తిప్పలు తప్పడంలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఫిక్స్‌డ్‌ డ్యూటీచార్ట్‌లను వేసేలా చూడాలని ఉద్యోగులు కోరుతున్నారు.

బస్సుల కండీషన్‌ మెరుగవుతుంది

ఫిక్స్‌డ్‌ డ్యూటీచార్ట్‌ల వేయడంవల్ల ఒక డ్రైవర్‌ ఒకే బస్సును నడుపుతారు. దీంతో ఆ బస్సు తాలూకు కండీషన్‌పై అవగాహనతో ఎప్ప టికప్పుడు సరిచేసుకునే వీలుంటుంది. పైపెచ్చు కేఎంపీఎల్‌ సాధించే వీలుతోపాటు సంస్థను లాభాలబాట పట్టించేందుకు దోహదపడుతుంది.

-దంతులూరి వెంకటరమణరాజు, ఎన్‌ఎంయూఏ జిల్లా అధ్యక్షుడు

ఆదాయ పెంపునకు దోహదం

ఫిక్స్‌డ్‌ డ్యూటీ చార్ట్‌లు వేయడంవల్ల సమయపాలన పాటించడంతోపాటుగా ఎక్కడ ఏ ప్రయాణికులు బస్సు ఎక్కుతారనే అవగాహన ఉంటుంది. దీంతో మరింత ఆదాయాన్ని సంస్థకు తీసుకువచ్చే వీలవుతుంది.

-బి.రమణ, ఈయూ సెక్రటరీ, తుని

Updated Date - 2022-09-27T06:53:08+05:30 IST