యోగాసనాలను ఇట్టే గుర్తిస్తాడు!

ABN , First Publish Date - 2020-11-18T05:30:00+05:30 IST

నాలుగైదు యోగాసనాలను చూపించి వాటి పేర్లు చెప్పమంటే పెద్దవాళ్లు సైతం తడబడతారు. కానీ ఐదేళ్లు కూడా నిండని ఈ బుడతడు 100 యోగాసనాలను గుర్తించడమే...

యోగాసనాలను ఇట్టే గుర్తిస్తాడు!

నాలుగైదు యోగాసనాలను చూపించి వాటి పేర్లు చెప్పమంటే పెద్దవాళ్లు సైతం తడబడతారు. కానీ ఐదేళ్లు కూడా నిండని ఈ బుడతడు 100 యోగాసనాలను గుర్తించడమే కాదు, వాటి పేర్లు కూడా చెబుతాడు.


  1. బెంగళూరుకు చెందిన ముక్షిత్‌ మోహన్‌ పాడేటికి యోగాసనాల గురించి తెలుసుకోవడమంటే ఇష్టం. ఆ ఇష్టమే అతనికి గుర్తింపును తీసుకొచ్చింది.
  2. ఈ చిన్నారి వంద యోగాసనాలను సరిగ్గా గుర్తిస్తాడు. గుర్తించడమంటే తాపీగా కాదు. వంద ఆసనాలను 2 నిమిషాల 38 సెకన్లలో చెప్పేస్తాడు.
  3. ఇంత చిన్న వయసులో యోగాసనాలను చూసి వాటి పేర్లను చెప్పినవారు ఇప్పటివరకు లేరు. ఈ బుడతడి ప్రతిభను చూసిన అధికారులు ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లోనూ స్థానం కల్పించారు.

Updated Date - 2020-11-18T05:30:00+05:30 IST