Kuwait లో పోలీసులపై దాడి చేస్తే.. 5ఏళ్ల జైలు, రూ.12.56లక్షల జరిమానా!

ABN , First Publish Date - 2022-03-22T16:01:10+05:30 IST

ఇటీవల తరచూ పోలీసులపై దాడి జరుగుతున్న ఘటనలు వెలుగుచూస్తుండడంతో కువైత్ అంతర్గత మంత్రిత్వశాఖ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.

Kuwait లో పోలీసులపై దాడి చేస్తే.. 5ఏళ్ల జైలు, రూ.12.56లక్షల జరిమానా!

కువైత్ సిటీ: ఇటీవల తరచూ పోలీసులపై దాడి జరుగుతున్న ఘటనలు వెలుగుచూస్తుండడంతో కువైత్ అంతర్గత మంత్రిత్వశాఖ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎవరైనా డ్యూటీలో ఉన్న పోలీస్ సిబ్బందిపై దాడికి పాల్పడితే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. దీనిలో భాగంగా దోషిగా తేలిన వారికి ఐదేళ్ల జైలు, 5వేల కువైటీ దినార్ల(రూ.12.56లక్షలు) జరిమానా విధించడం జరుగుతుందని వెల్లడించింది. ఇక భౌతిక దాడి కాకుండా బూతులు తిట్టేవారికి రెండేళ్ల జైలు శిక్షతో పాటు 3వేల దినార్లు(రూ.7.54లక్షలు) జరిమానా ఉంటుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో దేశ పౌరులు, నివాసితులకు మంత్రిత్వశాఖ వార్నింగ్ ఇచ్చింది. విధుల్లో ఉన్న పోలీసులపై దాడి చేసినా లేదా బూతులు తిట్టిన శిక్షార్హులు అవుతారని హెచ్చరించింది.  

Updated Date - 2022-03-22T16:01:10+05:30 IST