shocking: కొవిడ్ సోకిన ఐదుగురు టూరిస్టులు ఢిల్లీ నుంచి నైనిటాల్ వచ్చారు...పర్యటిస్తున్న వారి జాడ కోసం గాలిస్తున్న పోలీసులు

ABN , First Publish Date - 2021-10-06T13:00:37+05:30 IST

ఢిల్లీ నుంచి పర్యాటక ప్రాంతమైన నైనిటాల్ నగరానికి వచ్చిన ఐదుగురు పర్యాటకులకు కరోనా పాజిటివ్ అని తేలింది...

shocking: కొవిడ్ సోకిన ఐదుగురు టూరిస్టులు ఢిల్లీ నుంచి నైనిటాల్ వచ్చారు...పర్యటిస్తున్న వారి జాడ కోసం గాలిస్తున్న పోలీసులు

డెహ్రాడూన్ : ఢిల్లీ నుంచి పర్యాటక ప్రాంతమైన నైనిటాల్ నగరానికి వచ్చిన ఐదుగురు పర్యాటకులకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఐదుగురు టూరిస్టులు ఢిల్లీలో కొవిడ్ పరీక్ష కోసం స్వాబ్ ఇచ్చి నైనిటాల్ పర్యటనకు వచ్చారు. నైనిటాల్ పర్యటనకు వచ్చిన ఐదుగురికి కొవిడ్ పాజిటివ్ అని ఒక రోజు తర్వాత రిపోర్టు వచ్చింది. ఈ లోగా కొవిడ్ పాజిటివ్ వచ్చిన టూరిస్టులు నైనిటాల్ కు వచ్చారు. కొవిడ్ సోకిన యాత్రికుల జాడ లేకుండా పోవడంతో వైద్యాధికారులు వారి కోసం గాలింపు చేపట్టారు. ఢిల్లీలో జరిపిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన ఐదుగురు యాత్రికులు నైనిటాల్ వెళ్లారని, వారిని గుర్తించాలని కోరుతూ ఢిల్లీ వైద్యాధికారులు నైనిటాల్ వైద్యశాఖ అధికారులు, జిల్లా అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు. 


కొవిడ్ సోకిన యాత్రికుల జాడ కోసం తాము నైనిటాల్ నగరంలో గాలిస్తున్నామని స్థానిక అధికారులు చెప్పారు. కొవిడ్ సోకిన యాత్రికుల జాడ కనుక్కోవాలని కోరుతూ తాము పోలీసులకు సమాచారం అందించామని నైనిటాల్ బీడీ పాండే హాస్పిటల్ ప్రిన్సిపల్ మెడికల్ సూరింటెండెంట్ డాక్టర్ కేఎస్ ధామి చెప్పారు.పర్యాటక ప్రాంతమైన నైనిటాల్ లో కొవిడ్ సోకిన యాత్రికులు ఎక్కడ పర్యటిస్తున్నారోనని స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2021-10-06T13:00:37+05:30 IST