Abn logo
Sep 22 2021 @ 11:54AM

Delhi: ఫైవ్‌స్టార్ హోటల్ చెఫ్ చైన్ స్నాచర్

న్యూఢిల్లీ : ఓ ఫైవ్ స్టార్ హోటల్ చెఫ్ చైన్ స్నాచింగ్ లు చేసిన ఘటన దేశ రాజధాని నగరంలోని ఢిల్లీలో వెలుగుచూసింది.ఢిల్లీ నగరంలో చైన్ స్నాచింగులు, మొబైల్ ఫోన్ల స్నాచింగులకు పాల్పడిన హరీష్ అనే నిందితుడిని దక్షిణ ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో చెఫ్ గా పనిచేస్తున్న హరీష్ ను వలపన్ని నెబ్ సరాయ్ సమీపంలోని సిటీ ఫారెస్ట్ గేటు వద్ద పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు హరీష్ తుపాకీ తీసి కాల్పులు జరిపేందుకు యత్నించగా అతన్ని పోలీసులు పట్టుకొని తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. 

ఫైవ్ స్టార్ హోటల్ లో చెఫ్ గా పనిచేస్తున్న హరీష్ చైన్ స్నాచింగులకు పాల్పడటంతో పోలీసులు షాక్ కు గురయ్యారు. నిందితుడు నెబ్ సరాయ్ ప్రాంతంలో ఓ స్వర్ణకారుడికి మూడు బంగారు గొలుసులను విక్రయించాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.నిందితుడి నుంచి నాటుతుపాకీతోపాటు లైవ్ కాట్రిడ్జులు, నాలుగు మొబైల్ ఫోన్లు, నాలుగు బంగారు గొలుసులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


ఇవి కూడా చదవండిImage Caption