నిమ్స్‌లో ఐదు విభాగాలు మూడు రోజులు మూసివేత

ABN , First Publish Date - 2020-06-07T13:53:40+05:30 IST

తెలంగాణలో కరోనా కల్లోలం కనిపిస్తోంది. రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి.

నిమ్స్‌లో ఐదు విభాగాలు మూడు రోజులు మూసివేత

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కల్లోలం కనిపిస్తోంది. రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. శనివారం ఒక్క రోజే 206 మంది కరోనా బారిన పడ్డారు. నిమ్స్‌లో పలువురు వైద్యులు, సిబ్బంది వైరస్ బారిన పడడంతో ఆదివారం నుంచి మూడు రోజులపాటు ఐదు విభాగాలను మూసివేసి శానిటైజ్ చేయనున్నారు. తెలంగాణలో కరోనా బారిన పడుతున్న వైద్యుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు మొత్తం 68 మంది డాక్టర్లకు కరోనా పాజిటీవ్ వచ్చింది. 


ఉస్మానియాలో 41 మందికి, నిమ్స్‌లో 12 మంది, గాంధీలో నలుగురు వైరస్ బారిన పడ్డారు. 8 మంది పారామెడికల్ సిబ్బందికి కరోనా పాజిటీవ్‌గా తేలింది. ముగ్గురు డెంటల్ విద్యార్థులకు వైరస్ సోకింది. నిమ్స్‌లో పలువురు వైద్యులు, సిబ్బందికి కరానా వైరస్ సోకడంతో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఇవాల్టి నుంచి మూడు రోజుల పాటు నిమ్స్‌లోని ఐదు విభాగాలు మూసి.. ఆ విభాగాలను పూర్తిగా శానిటైజ్ చేయాలని అధికారులు భావిస్తున్నారు.

Updated Date - 2020-06-07T13:53:40+05:30 IST