5 పైసలకే బిర్యానీ ఆఫర్... రెస్పాన్స్ చూసి బిత్తర పోయిన ఓనర్

ABN , First Publish Date - 2021-07-22T02:40:14+05:30 IST

బిర్యానీ.... అనడమే ఆలస్యం అందరి నోళ్లలో నీళ్లూరడం ఖాయం. బిర్యానీ అంటే... ఎగబడని వారు చాలా తక్కువగా ఉంటారు

5 పైసలకే బిర్యానీ ఆఫర్... రెస్పాన్స్ చూసి బిత్తర పోయిన  ఓనర్

చెన్నై : బిర్యానీ.... అనడమే ఆలస్యం అందరి నోళ్లలో నీళ్లూరడం ఖాయం. బిర్యానీ అంటే... ఎగబడని వారు చాలా తక్కువగా ఉంటారు. కేవలం 5 పైసలకే బిర్యానీ అంటే... ఇక మామూలుగా ఉండదు కదా. ఈ జమానాలో 5 పైసలు ఎవరి దగ్గర ఉంటాయని భావిస్తున్నారా? ఆ హోటల్ యాజమాన్యం కూడా అదే రకంగా అనుకొని, ఈ ఆఫర్ ప్రకటించింది. ఆఫర్ ప్రకటించిన కొద్ది గంటల్లో 5 పైసల నాణేలతో ప్రజలు ఎగబడ్డారు. దీంతో హోటల్ యాజమాన్యం బిత్తరపోయింది. వారి కళ్లు బైర్లు కమ్మాయి. ప్రజలు పెద్ద సంఖ్యలో 5 పైసల నాణేలతో వచ్చి నిలబడ్డారు. ఈ సంఘటన చెన్నైలో జరిగింది. హోటల్ యాజమాన్యం సరదాకు ప్రకటించిందో, ఎవరూ రారని అనుకున్నారో,  కానీ సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. దీంతో ఆ హోటల్ యాజమాన్యం దెబ్బకు షెటర్ వేసేసింది. అయినా... ప్రజలు అక్కడి నుంచి కదల్లేదు. అదీ విచిత్రం.

Updated Date - 2021-07-22T02:40:14+05:30 IST