రెండు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురికి గాయాలు

ABN , First Publish Date - 2021-11-27T05:30:00+05:30 IST

మండల పరిధిలోని నామ్‌ రోడ్డులో రెండుచోట్ల శనివారం జరిగిన ప్రమాదాల్లో ఐదుగురుకి గాయాలయ్యాయి. ఇందులో ఒకటి పట్టణంలోని ఎన్టీఆర్‌నగర్‌ వద్ద, మరొకటికి శింగరకొండ సమీపంలోని చెరువు కట్ట వద్ద చోటుచేసుకున్నాయి. స్థానికుల కథనం మేరకు.. నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలుకు చెందిన శ్రీనివాసరావు అద్దంకిలోని ఎన్టీఆర్‌నగర్‌ వద్ద ఉన్న ఒక దుకాణంలో వాచ్‌మన్‌గా పని చేస్తున్నాడు. టిఫిన్‌ చేసేందుకు ఆయన రోడ్డుదాటుతుండగా కొండపి నుంచి హైదరాబాద్‌కు మోటారు సైకిల్‌పై వెళ్తున్న ఏడుకొండలు ఢీకొట్టాడు.

రెండు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురికి గాయాలు
శింగరకొండ సమీపంలో నామ్‌ రోడ్డుపై రక్త గాయాలతో పడి ఉన్న ద్విచక్ర వాహనచోదకులు

  అద్దంకి, నవంబరు 27 : మండల పరిధిలోని నామ్‌ రోడ్డులో రెండుచోట్ల శనివారం జరిగిన ప్రమాదాల్లో ఐదుగురుకి గాయాలయ్యాయి. ఇందులో ఒకటి పట్టణంలోని ఎన్టీఆర్‌నగర్‌ వద్ద, మరొకటికి శింగరకొండ సమీపంలోని చెరువు కట్ట వద్ద చోటుచేసుకున్నాయి. స్థానికుల కథనం మేరకు.. నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలుకు చెందిన శ్రీనివాసరావు అద్దంకిలోని ఎన్టీఆర్‌నగర్‌ వద్ద ఉన్న ఒక దుకాణంలో వాచ్‌మన్‌గా పని చేస్తున్నాడు. టిఫిన్‌ చేసేందుకు ఆయన రోడ్డుదాటుతుండగా కొండపి నుంచి హైదరాబాద్‌కు మోటారు సైకిల్‌పై వెళ్తున్న ఏడుకొండలు ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో శ్రీనివాసరావుకు తీవ్రగాయాలు కాగా, ఏడుకొండలు స్వల్పంగా గాయపడ్డాడు.  క్షతగాత్రులిద్దరినీ హైవే పెట్రోలింగ్‌ పోలీసులు తమ వాహనంలో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించారు. ప్రాథమిక చికిత్స అనంతరం శ్రీనివాసరావును 108లో ఒంగోలుకు తరలించారు. 

శింగరకొండ వద్ద..

శింగరకొండ సమీపంలో భవనాసి చెరువు వద్ద నామ్‌ రోడ్డుపై రెండు మోటారు సైకిళ్లు ఢీకొనడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు.. నాగులుప్పలపాడు మండల అమ్మనబ్రోలుకు చెందిన పాటిబండ్ల సుబ్బారావు, కాశయ్య మోటార్‌సైకిల్‌పై శింగరకొండ మీదుగా నామ్‌రోడ్డులోకి వెళ్తున్నారు. అదేసమయంలో సంతమాగులూరు మండలం గురిజేపల్లి నుంచి రాములు అద్దంకి వైపు మోటార్‌ సైకిల్‌పై వస్తున్నాడు. చెరువు కట్ట వద్ద రెండు వాహనాలు ఢీకొన్నాయి.  సుబ్బారావు, కాశయ్యలకు తీవ్ర గాయాలు కాగా, రాములుకు స్వల్పంగా గాయపడ్డాడు. క్షతగాత్రులను 108లో ఒంగోలు తరలించారు. సంఘటనా స్థలాలను పోలీసులు పరిశీలించారు.




Updated Date - 2021-11-27T05:30:00+05:30 IST