మరో ఐదుగురి మృతి

ABN , First Publish Date - 2021-05-06T05:49:28+05:30 IST

జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి.

మరో ఐదుగురి మృతి

కరోనా కేసుల సంఖ్య 1,985


కర్నూలు(హాస్పిటల్‌), మే 5: జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. బుధవారం 5,341 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,985 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. దీంతో కరోనా బాధితుల సంఖ్య 86,447కు చేరింది. 12,997 మంది కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా.. కరోనా నుంచి కోలుకుని 72,877 మంది డిశ్చార్జి అయ్యారు. కరోనాతో ఐదుగురు మృతి చెందగా మృతుల సంఖ్య 573కు చేరింది.


ప్రైవేటు ఆసుపత్రుల్లో మరణాల నమోదు ఏదీ?
 ప్రభుత్వ కొవిడ్‌ ఆసుపత్రుల్లో మాత్రమే కరోనా మరణాలను అధికారులు నమోదు చేస్తున్నారు. జిల్లాలోని 28 నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో కొవిడ్‌ సేవలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చారు. మరి ఈ ఆసుపత్రుల్లో మరణాలను పరిగణనలోకి తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.


7 వేల ర్యాపిడ్‌ కిట్లు
కరోనా నిర్ధారణలో ఇప్పటివరకు ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు చేస్తుండగా.. తీవ్ర జాప్యం జరుగుతోంది. దీనివల్ల టెస్టులు చేయించుకున్న వారు రిపోర్టు వచ్చే వరకు బయటకు తిరుగుతూ వైరస్‌ వ్యాప్తికి కారకులవుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా నిర్ధారణ 10 నిమిషాల్లో వెల్లడించే ర్యాపిడ్‌ యాంటిజిన్‌ పరీక్షలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. 7 వేల ర్యాపిడ్‌ యాంటిజన్‌ పరీ క్షలు జిల్లాకు వచ్చినట్లు అడిషినల్‌ డీఎంహెచ్‌వో డా.మోక్షేశ్వరుడు వెల్లడించారు.


తహసీల్దార్‌ కార్యాలయంలో కరోనా
డోన్‌, మే 5:
డోన్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో కొవిడ్‌ కలకలం రేపుతోంది. ఒక అధికారి, ఏడుగురు వీఆర్వోలకు పాజిటివ్‌ వచ్చింది. దీంతో మిగతా వారు ఆందోళనకు గురవుతున్నారు.

Updated Date - 2021-05-06T05:49:28+05:30 IST