Abn logo
Oct 19 2020 @ 00:59AM

మహారాష్ట్రలో ఐదుగురు నక్సల్స్‌ హతం

నాగ్‌పూర్‌, అక్టోబరు 18: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఐదుగురు నక్సల్స్‌ను పోలీసులు హతమార్చారు. జిల్లాలోని కోస్మి-కిస్నేలీ అడవుల్లో పోలీసులు ఆదివారం కూంబింగ్‌ నిర్వహిస్తుండగా నక్సల్స్‌ కాల్పులు జరిపారు. పోలీసులు కూడా దీటుగా బదులిచ్చారు. ఈ క్రమంలో ఇరు పక్షాల మధ్య కాల్పులు జరిగాయి.

అనంతరం ఘటనా స్థలం నుంచి నక్సల్స్‌ పారిపోయారు. ఆ ప్రాంతాన్ని పరిశీలించగా ఐదుగురు నక్సల్స్‌ మృతి చెందినట్లు గుర్తించారు. వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులను గుర్తించాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో అడవిలో నక్సల్‌ వ్యతిరేక ఆపరేషన్‌ను పోలీసులు తీవ్రం చేశారు.


Advertisement
Advertisement
Advertisement