Pakistanలో దారుణం...గర్భిణీపై సామూహిక అత్యాచారం

ABN , First Publish Date - 2022-06-06T16:13:42+05:30 IST

పాకిస్థాన్ దేశంలో మరో దారుణం జరిగింది....

Pakistanలో దారుణం...గర్భిణీపై సామూహిక అత్యాచారం

కరాచీ : పాకిస్థాన్ దేశంలో మరో దారుణం జరిగింది. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని జీలం నగరంలో ఐదుగురు వ్యక్తులు ఓ గర్భిణి ఇంట్లోకి చొరబడి, భర్త ముందే ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు.భర్తను తాళ్లతో కట్టేసి గర్భిణీపై సామూహిక అత్యాచారం చేశారు.దాడి అనంతరం మహిళ స్వయంగా ఆస్పత్రికి వచ్చింది. బాధితురాలు తనకు జరిగిన బాధను వివరించడంతో ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఆమె రక్త నమూనాలను ఫోరెన్సిక్ పరీక్ష కోసం లాహోర్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు.ఈ కేసును విచారించేందుకు పంజాబ్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. 


పంజాబ్ ఐజీపీ సంబంధిత అధికారుల నుంచి నివేదిక కోరారు.మహిళలపై జరుగుతున్న నేరాల పరంపరలో ఈ ఘటన పాకిస్థాన్‌ను దిగ్భ్రాంతికి గురి చేసింది. గత నెలలో కరాచీలో కదులుతున్న రైలులో 25 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది.పాకిస్తాన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలో ప్రతిరోజూ 11 అత్యాచార కేసులు నమోదవుతున్నాయి. గత ఆరేళ్లలో 22,000 పైగా అత్యాచారం కేసులు నమోదయ్యాయి.


Updated Date - 2022-06-06T16:13:42+05:30 IST