కెనడాలో షాకింగ్ ఘటన.. కారులో వెళుతూ కాల్పులు..

ABN , First Publish Date - 2022-04-18T05:25:17+05:30 IST

కెనడాలో మరోమారు కాల్పుల కలకలం రేగింది. గుర్తు తెలియని వ్యక్తులు కొందరు శనివారం టొరొంటో నగరంలోగ ఓ మాసీదు పక్కనే ఉన్న పార్కింగ్ స్థలంలోని వారిపై కాల్పులు జరిపి పారిపోయారు.

కెనడాలో షాకింగ్ ఘటన.. కారులో వెళుతూ కాల్పులు..

ఎన్నారై డెస్క్: కెనడాలో మరోమారు కాల్పుల కలకలం రేగింది. గుర్తు తెలియని వ్యక్తులు కొందరు శనివారం టొరొంటో నగరంలోగల ఓ మాసీదు పక్కనే ఉన్న పార్కింగ్ స్థలంలోని వారిపై కాల్పులు జరిపి పారిపోయారు. స్కార్‌బరో ప్రాంతంలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో ఐదుగురికి గాయాలయ్యాయి. రమ్‌జాన్ మాసం సందర్భంగా కొందరు మసీదులో ప్రార్థనలు ముగించుకుని కారు ప్కారింగ్ స్థలంలో నిలబడ్డ సమయంలో దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. అయితే.. ఏ కారణంతో నిందితులు ఈ దాడికి తెగబడ్డారనేది ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు.. స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే.. ఇది ద్వేషపూరిత దాడి అవునో కాదు ఇప్పుడే కష్టమని తెలిపారు. బాధితులు అందరూ 28 నుంచి 35 ఏళ్ల మధ్య వారేనని పేర్కొన్నారు. 

Updated Date - 2022-04-18T05:25:17+05:30 IST