గదిలో ఓ మూలన స్లాబులో చిన్న వస్తువు.. అనుమానంతో చెక్ చేస్తే బయటపడ్డ సీసీ కెమెరా.. గర్ల్స్ హాస్టల్‌లో..

ABN , First Publish Date - 2021-12-30T20:39:52+05:30 IST

ఐదుగురు ఫ్రెండ్స్ ఒకే హాస్టల్‌లో ఉండాలనుకున్నారు. చుట్టుపక్కల అన్ని పరిశీలించి.. ఓ హాస్టల్‌లో దిగారు. దాదాపు నెల రోజులు గడిచిన తర్వాత వారికి అనుమానం కలిగింది. గదిలో సీసీ కెమెరాలు ఉన్నాయే

గదిలో ఓ మూలన స్లాబులో చిన్న వస్తువు.. అనుమానంతో చెక్ చేస్తే బయటపడ్డ సీసీ కెమెరా.. గర్ల్స్ హాస్టల్‌లో..

ఇంటర్నెట్ డెస్క్: ఐదుగురు ఫ్రెండ్స్ ఒకే హాస్టల్‌లో ఉండాలనుకున్నారు. చుట్టుపక్కల అన్ని పరిశీలించి.. ఓ హాస్టల్‌లో దిగారు. దాదాపు నెల రోజులు గడిచిన తర్వాత వారికి అనుమానం కలిగింది. గదిలో సీసీ కెమెరాలు ఉన్నాయేమో అని సందేహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే గదిలోని ప్రతి మూలను క్షుణ్ణంగా పరిశీలించారు. స్లాబులో ఉన్న చిన్న వస్తువు చూసి కంగుతిన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..



చత్తీస్‌గఢ్‌లోని భిలాయ్ ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న ఐదుగురు యువతులు.. హాస్టల్‌లో ఉండాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనే నెల క్రితం స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ హాస్టల్‌లో చేరారు. తర్వాత వారికి షాకింగ్ అనుభవం ఎదురైంది. వారి గదిలో చేసే ప్రతి చిన్న పని.. హాస్టల్ నిర్వాహకులకు తెలిసిపోతుండటంతో కంగుతిన్నారు. దీంతో తమ గదిలో ఎవరైనా సీసీ కెమెరా అమర్చారేమో అని అనుమానించారు. ఈ నేపథ్యంలోనే సోమవారం రోజు.. తమ గదిని క్షుణ్ణంగా పరిశీలించారు. గదిలో మూలన స్లాబులో ఓ వస్తువు కనపడటంతో దాన్ని నిశితంగా పరిశీలించారు. చివరికి వారి అనుమానమే నిజమైంది. అందులో సీసీ కెమెరా ఉండటంతో షాకయ్యారు. అనంతరం హాస్టల్ నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు.. హాస్టల్ యజమానిపై కేసు నమోదు చేశారు. 




Updated Date - 2021-12-30T20:39:52+05:30 IST