ఈ ప్లాన్స్‌తో... అదనంగా 5 జీబీ ఎక్స్‌ట్రా డేటా...

ABN , First Publish Date - 2021-01-21T22:37:15+05:30 IST

వినియోగదారులు కొన్ని రీఛార్జ్ ప్లాన్స్‌తో 5 జీబీ వరకు అదనంగా డేటాను పొందవచ్చు. పోటీని తట్టుకుని నిలబడేందుకు టెలికాం కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త ఆఫర్లతో ముందుకొస్తుండడం తెలిసిన విషయమే.

ఈ ప్లాన్స్‌తో...  అదనంగా 5 జీబీ ఎక్స్‌ట్రా డేటా...

ముంబై : వినియోగదారులు కొన్ని రీఛార్జ్ ప్లాన్స్‌తో 5 జీబీ వరకు అదనంగా డేటాను పొందవచ్చు. పోటీని తట్టుకుని నిలబడేందుకు టెలికాం కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త ఆఫర్లతో ముందుకొస్తుండడం తెలిసిన విషయమే. తాజాగా వచ్చినకొన్ని రీఛార్జ్ ప్లాన్స్‌తో 5 జీబీ వరకు ఈ కస్టమర్లు డేటాను పొందే వెసులుబాటు అందుబాటులోకి రావడం విశేషం. 


 తన ప్రీపెయిడ్ ప్లాన్స్‌పై వోడాఫోన్ ఐడియా 5 జీబీ డేటాను అదనంగా అందిస్తోంది. అయితే... వినియోగదారులు ఎంవైవీఐ యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకుంటే మాత్రమే... అదనపు డేటా ప్రయోజనాలందుతాయి.  వొడాఫోన్ ఐడియా 28 రోజుల వ్యాలిడిటీతో, రూ. 219 విలువతో ప్రవేశపెట్టినరీఛార్జ్ ప్లాన్ ఇది. ఇందులో అదనంగా 2 జీబీ డేటా లభిస్తుంది. ప్రతిరోజూ వంద ఎస్ఎంఎస్‌‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్ అందుబాటులోకొస్తాయి. 


వొడాఫోన్ ఐడియా రూ. 399 తో 56 రోజుల వాలిడిటీతో కూడుకున్న మరో రీఛార్జ్ ప్లాన్ ను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఇందులో... ప్రతీరోజూ 1.5 జీబీ డేటా లభిస్తుంది. దీంతోపాటు అదనంగా 5 జీబీ డేటా లభిస్తుంది. ప్రతీరోజూ 100 ఎస్ఎంఎస్‌‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. 


ఇక 84 రోజుల వ్యాలిడిటీతో, రూ.599 తో కూడుకున్న మరో రీఛార్జ్ ప్లాన్ ను కూడా వొడాఫోన్  ప్రకటించింది. ఇందులో రోజుకు 1.5 జీబీ డేటా, అదనంగా 5 జీబీ డేటా లభిస్తుంది. ప్రతీరోజూ వంద ఎస్ఎంఎస్‌‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్ ఉంటాయి. దీంతోపాటు మరో ప్రయోజనం... ఆ వారంలో ఉపయోగించని డేటాను వీకెండ్‌(వీకెండ్ రోల్ ఓవర్ బెనిఫిట్)లో వినియోగించుకోగలిగే సౌలభ్యముండడం విశేషం.


ఇక రూ. 149 విలువ, 28 రోజుల వ్యాలిడిటీతో మరో రీఛార్జ్ ప్లాన్ ను కూడా వొడా ఫోన్ అందుబాటులోకి తెచ్చింది. ఇందులో 2 జీబీ డేటా, అదనంగా మరో 2 జీబీ డేటా అందుబాటులో ఉంటుంది. ఇక రోజుకు 300 ఎస్ఎంఎస్‌‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్ ఉంటాయి 

Updated Date - 2021-01-21T22:37:15+05:30 IST