ఆంగ్ సాన్ సూకీపై మరో ఐదు కేసులు

ABN , First Publish Date - 2022-01-15T16:29:57+05:30 IST

ఈ ఏడాది ఫిబ్రవరి 1న ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసిన సైన్యం 76 ఏళ్ల సూకీతోపాటు మరికొంత మంది నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమొక్రసీ పార్టీ నేతలను నిర్బంధంలో ఉంచిన సంగతి తెలిసిందే. గత నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఆంగ్‌సాన్‌ సూకీ నేతృత్వంలోని నేషనల్‌..

ఆంగ్ సాన్ సూకీపై మరో ఐదు కేసులు

నేపిటూ: పోయిన ఏడాది ఫిబ్రవరిలో మయన్మార్ ప్రభుత్వంపై మిలిటరీ తిరుగుబాటు చేసి ఆ దేశంలోని కీలక నేత ఆంగ్ సాన్ సూకీని నిర్బంధించింది. కాగా, నెలల విచారణ అనంతరం ఆమెకు ఆరేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తున్నట్లు అక్కడి ప్రత్యేక కోర్టు డిసెంబర్ మొదటి వారంలో తీర్పు వెలువరించింది. కోవిడ్‌ కాలంలో ప్రజల్ని రెచ్చగొట్టడం, కరోనావైరస్ నియంత్రణలను ఉల్లంఘించారనే ఆరోపణలపై ఆమెకు ఈ శిక్ష విధించింది. అయితే నెల రోజులు కూడా గడవక ముందే ఆమెపై మరో ఐదు కేసులు నమోదు అయ్యాయి. ఆంగ్ సాన్ సూకీ అవినీతికి పాల్పడ్డారని, ఈ విషయంలోనే ఆమెపై కొత్తగా కేసులు నమోదు అయ్యాయని తెలిసింది. కాగా ఆమెపై నమోదైన కేసులు అన్నీ విచారణ పూర్తైతే ఆమెకు 160 సంవత్సరాల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు మయన్మార్ స్థానిక వర్గాలు పేర్కొన్నాయి.


ఈ ఏడాది ఫిబ్రవరి 1న ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసిన సైన్యం 76 ఏళ్ల సూకీతోపాటు మరికొంత మంది నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమొక్రసీ పార్టీ నేతలను నిర్బంధంలో ఉంచిన సంగతి తెలిసిందే. గత నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఆంగ్‌సాన్‌ సూకీ నేతృత్వంలోని నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమొక్రసీ పార్టీ రెండో దఫా కూడా ఘన విజయం సాధించగా.. సైన్యం, దాని మిత్ర పక్షాలు పార్టీలు ఘోర ఓటమిపాలయ్యాయి. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించిన సైన్యం ఫిబ్రవరిలో ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసింది. ఇక సైన్యం అరాచకాలకు వ్యతిరేకంగా ఇప్పటికే ప్రజలు నిరసనలతో హోరెత్తుతుండగా ఆంగ్‌ సాన్‌కి జైలు శిక్ష విధించడం మరింత ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉంది.

Updated Date - 2022-01-15T16:29:57+05:30 IST