Abn logo
Sep 17 2020 @ 12:12PM

ఆటో రిక్షాలో ఐదుడుగుల కొండచిలువ ప్రత్యక్షం

న్యూఢిల్లీ : ఐదు అడుగుల పొడవు గల కొండచిలువ ఓ ఆటో రిక్షాలో ప్రత్యక్షమైన ఘటన ఢిల్లీలోని తుగ్లకాబాద్ ప్రాంతంలో వెలుగుచూసింది. తుగ్లకాబాద్ ప్రాంతంలో ఓ ఆటోను రోడ్డు పక్కన పార్కింగ్ చేశారు. ఈ ఆటోలో ఐదుఅడుగుల పొడవున్న కొండచిలువ దర్శనమివ్వడంతో స్థానికులు భయాందోళనలు చెందారు. ఆటోలో వెనుక భాగంలో సీఎన్ జీ కిట్ కింద కొండచిలువ దర్శనమివ్వడంతో ఆటో డ్రైవరు హెల్ప్ లైన్ నంబరుకు ఫోన్ చేశారు.ఇద్దరు వాలంటీర్లు వచ్చి సిలిండరును చుట్టుముట్టిన కొండచిలువను పట్టుకొని, దాన్ని సమీప అడవిలో వదిలివేశారు. ఆటోకి కొండచిలువ ఎలా వచ్చిందో తెలియలేదని ఆటో డ్రైవరు చెప్పారు.

Advertisement
Advertisement