Surat: రసాయన ట్యాంకరు నుంచి వెలువడిన విషవాయువు...ఐదుగురు కార్మికుల మృతి

ABN , First Publish Date - 2022-01-06T14:40:06+05:30 IST

గుజరాత్‌ రాష్ట్రంలోని సూరత్‌లో విషపూరిత వాయువు ప్రభావంతో ఐదుగురు ఫ్యాక్టరీ కార్మికులు మరణించారు...

Surat: రసాయన ట్యాంకరు నుంచి వెలువడిన విషవాయువు...ఐదుగురు కార్మికుల మృతి

సూరత్ : గుజరాత్‌ రాష్ట్రంలోని సూరత్‌లో విషపూరిత వాయువు ప్రభావంతో ఐదుగురు ఫ్యాక్టరీ కార్మికులు మరణించారు.గుజరాత్‌లోని సూరత్ జిల్లాలో గురువారం సమీపంలో ఆగి ఉన్న రసాయన ట్యాంకర్ నుంచి వెలువడిన విషపూరిత వాయువును పీల్చడం వల్ల డైయింగ్ ఫ్యాక్టరీలోని ఐదుగురు కార్మికులు దుర్మరణం చెందారు. ఈ దుర్ఘటనలో మరో 12మందికి పైగా ఇతరులు ఆసుపత్రి పాలైనట్లు అధికారులు తెలిపారు. ఫ్యాక్టరీ లోపల కార్మికులు నిద్రిస్తుండగా విషవాయువు వెలువడటంతో ఈ దుర్ఘటన జరిగిందని అధికారులు తెలిపారు.


 ‘‘సచిన్ జిఐడీసీ ప్రాంతంలోని తమ ఫ్యాక్టరీ సమీపంలో ఆపి ఉంచిన రసాయన ట్యాంకర్ నుంచి వెలువడే విషపూరిత పొగలను పీల్చడం వల్ల 25 మంది స్పృహతప్పి పడిపోయారని, వారిలో ఐదుగురు కార్మికులు ఆసుపత్రిలో మరణించారు’’ అని సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ అగ్నిమాపక కార్యాలయం ఇన్‌ఛార్జ్ చీఫ్ బసంత్ పరీక్ చెప్పారు.


Updated Date - 2022-01-06T14:40:06+05:30 IST