అబాడాన్(ఇరాన్): ఇరాన్ దేశంలో పది అంతస్థుల భవనం కుప్పకూలిన దుర్ఘటనలో ఐదుగురు మరణించారు. ఇరాన్ దేశంలోని దక్షిణ నగరమైన అబాడాన్లో 10 అంతస్తుల భవనం పాక్షికంగా కూలిపోవడంతో ఐదుగురు మరణించగా, పలువురు గాయపడ్డారు. భవన శిథిలాల కింద చిక్కుకున్న 80 మందిని రక్షించడానికి సహాయ సిబ్బంది ప్రయత్నిస్తున్నారని ఇరాన్ అధికారులు చెప్పారు.కూలిన ఈ భవనం ఇరాక్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న నగరంలోని అమీర్ కబీర్ వీధిలోని నివాస-వాణిజ్య ఆస్తిగా గుర్తించారు.రెస్క్యూ ఆపరేషన్లో సహాయం చేయడానికి ఇతర నగరాల నుంచి అత్యవసర బృందాలను పంపుతున్నట్లు అధికారులు చెప్పారు. రెండు రెస్క్యూ డాగ్లు, ఒక హెలికాప్టర్, ఏడు రెస్క్యూ వాహనాలు ఇప్పటికే సంఘటనా స్థలంలో ఉన్నాయి. ఖుజెస్తాన్ ప్రావిన్స్ న్యాయవ్యవస్థ అధిపతి భవనం కూలిపోవడంపై దర్యాప్తునకు ఆదేశించారు. భవన యజమాని, దాన్ని నిర్మించిన కాంట్రాక్టర్ను అరెస్టు చేసినట్లు ఇరాన్ అధికారులు చెప్పారు.
ఇవి కూడా చదవండి