గంజాం జిల్లా పట్టణాల్లో 5 రోజుల పాటు షట్ డౌన్

ABN , First Publish Date - 2020-07-08T11:26:20+05:30 IST

కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు గంజాం జిల్లా కలెక్టరు జులై 9 నుంచి 13వతేదీ వరకు ఐదు రోజులపాటు పట్టణప్రాంతాల్లో షట్ డౌన్ విధిస్తూ ఆదేశాలు....

గంజాం జిల్లా పట్టణాల్లో 5 రోజుల పాటు షట్ డౌన్

గంజాం (ఒడిశా): కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు గంజాం జిల్లా కలెక్టరు జులై 9 నుంచి 13వతేదీ వరకు ఐదు రోజులపాటు పట్టణప్రాంతాల్లో షట్ డౌన్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.గంజాం జిల్లాలోని బెర్హంపూర్, హింజిలికట్ మున్సిపాలిటీలతో పాటు బ్లాక్ హెడ్ క్వార్టర్స్ లలో కరోనా కేసులు పెరుగుతున్నందున దాన్ని కట్టడి చేసేందుకు ఆయా ప్రాంతాల్లో ఐదురోజులపాటు షట్ డౌన్ విధిస్తున్నట్లు గంజాం జిల్లా కలెక్టరు విజయ్ అమృత ఆదేశాలు జారీ చేశారు. షట్ డౌన్ సందర్భంగా నిత్యావసర సర్వీసులకు మినహాయింపు ఇస్తామని కలెక్టరు పేర్కొన్నారు. ఒడిశా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 9,526కు పెరగడంతో పాటు 38 మంది మరణించారు. దీంతో కరోనాను కట్టడి చేసేందుకు కలెక్టరు షట్ డౌన్ ఉత్తర్వులు జారీ చేశారు. 

Updated Date - 2020-07-08T11:26:20+05:30 IST