Kuwait: మళ్లీ అమలులోకి ఆ నిబంధన

ABN , First Publish Date - 2022-07-03T14:01:06+05:30 IST

గడిచిన కొన్నిరోజులుగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో గల్ఫ్ దేశం కువైత్ మరోసారి ఐసోలేషన్ నిబంధను అమలులోకి తీసుకువచ్చింది.

Kuwait: మళ్లీ అమలులోకి ఆ నిబంధన

కువైత్ సిటీ: గడిచిన కొన్నిరోజులుగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో గల్ఫ్ దేశం కువైత్ మరోసారి ఐసోలేషన్ నిబంధను అమలులోకి తీసుకువచ్చింది. కోవిడ్-19 పాజిటివ్‌గా తేలిన వారు తప్పనిసరిగా ఐదు రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాలని కువైత్ ఆరోగ్యమంత్రిత్వశాఖ శనివారం వెల్లడించింది. ఇమ్యూన్ యాప్ (Immune App) ద్వారా పాజిటివ్ కేసులను మానిటరింగ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఇంతకుముందు ఉన్న ష్లోనిక్ యాప్(Shlonik App) స్థానంలో ఇమ్యూన్ యాప్‌ను తీసుకువచ్చినట్లు తెలిపింది. ఇకపై కరోనా పాజిటివ్ తేలిన వారు తప్పనిసరిగా ఐదు రోజుల పాటు ఐసోలేషన్ ఉండాలని, అలాగే ఆ తర్వాత మరో ఐదురోజులు ముఖానికి మాస్క్ ధరించడం తప్పనిసరి అని శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడించింది. ఎవరైతే కరోనా బారిన పడతారో వారి ఇమ్యూన్ యాప్ స్టేటస్ ఆటోమెటిక్‌గా రెడ్‌గా ఉంటుందని పేర్కొంది. పౌరులు, నివాసితులు ఈ నిబంధనను తప్పకుండా పాటించాలని సూచించింది.  


Updated Date - 2022-07-03T14:01:06+05:30 IST