Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

ఫిట్‌నెస్‌ తప్పనిసరి

twitter-iconwatsapp-iconfb-icon
ఫిట్‌నెస్‌ తప్పనిసరిఆర్టీఏ కార్యాలయంలో తనిఖీకి సిద్ధంగా ఉన్న బస్సులు

జిల్లాలోని స్కూల్‌, కాలేజ్‌ బస్సులకు సామర్థ్య పరీక్షలు షురూ

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం 14,00 పైగా బస్సులు

ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుకింగ్‌

ఫిట్‌నెస్‌ టెస్టుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిద్ధంగా ఉన్న బృందం

15 ఏళ్లు దాటితే.. వాహనాలు షెడ్డుకే

జూన్‌ నెలలో ప్రారంభం కానున్న ఆయా విద్యా సంస్థలు

ఫిట్‌నెస్‌ లేకుండా రోడ్డుమీదకు వస్తే సీజ్‌ చేస్తామంటున్న అధికారులు 

నిజామాబాద్‌ రూరల్‌, మే 22: విద్యాసంస్థలు జూన్‌ నెలలో పునఃప్రారంభం కానున్నాయి. దీంతో విద్యాసంస్థలకు చెందిన వాహనాలు కండీషన్‌లో ఉంచుకునే సమయం రానే వచ్చింది. మే, జూన్‌ నెలల్లో స్కూల్‌, కళాశాల బస్సులకు సామర్థ్య పరీక్షలు(ఫిట్‌నెస్‌) జిల్లాలోని అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో నిర్వహిస్తారు. అందుకు రవాణా కార్యాలయాల్లో ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాన్ని సిద్ధం చేసినట్లు ఉమ్మడి జిల్లాల డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ డాక్టర్‌ కె.వెంకటరమణ తెలిపారు. జూన్‌ నెల నుంచి స్కూల్‌ బస్సులు మళ్లీ రోడ్డెక్కనున్నారుు. వాటి ఫిట్‌నెస్‌ పరీక్షల కోసం ఆర్టీఏ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. విద్యార్థులను తరలించే ప్రతీ బస్సు ఫిట్‌గా ఉండాలని, పరీక్షలు నిర్వహించి ధ్రువీకరణ పత్రం పొందాలని ఆయన స్పష్టం చేశారు. అందుకోసం ప్రభుత్వం జీవో నెం. 35/2011ను ప్రభుత్వం రూపొందించినట్లు తెలిపారు.  ఫిట్‌నెస్‌ లేని వాహనాల్లో స్కూలు పిల్లలను తీసుకెళ్లి ప్రమాదాల బారిన పడి ఇబ్బందులు కొనితెచ్చుకోవద్దన్నారు. ఫిట్‌నెస్‌ లేని వాహనా లు రోడ్ల మీదకు వస్తే కచ్చితంగా వాటిని సీజ్‌ చేయడంతోపాటు వాహన యజమానులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. వాహనాలకు రిజిష్ట్రేషన్‌ సర్టిఫికెట్‌, వెహికల్‌ ఇన్సూరెన్స్‌, ఫిట్‌నెస్‌ ధ్రువీకరణ పత్రం, పర్మిట్‌, చెల్లించిన పన్నుల రశీదులు, పొల్యూషన్‌ సర్టిఫికెట్లతో పాటు డ్రైవర్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌, వంటి పత్రాలు సిద్ధం చేకోవాలని ఉమ్మడి జిల్లా డీటీసీ సూచించారు.

1400లకు పైగా స్కూల్‌ బస్సులు

నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో విద్యాసంస్థలకు చెందిన 1400 పైగా బస్సులున్నాయి. ఇందులో కామారెడ్డి జిల్లాలో 400పైగా కాగా, మిగతా వెయ్యి బస్సుల వరకు జిల్లాకు చెందినవి. ఫిట్‌నెస్‌ పరీక్షలు జిల్లా కేంద్రంలోని నాగారంలో గల ప్రధాన కార్యాలయంలో పాటు ఆర్మూర్‌, బోధన్‌, కామారెడ్డి బాన్సువాడ, రవాణా కార్యాలయాల్లో ఈ ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఏవీఎంఐ, ఎంవీఐ, ఎస్సై, హోంగార్డులతో కూడిన ప్రత్యేక బృందం పాఠశాలలు, కళాశాలల బస్సులను తనిఖీ చేస్తారు. ప్రస్తుతం విద్యార్థుల బస్సులు 18 నుంచి 55 సీట్ల వరకు అందుబాటులో ఉంటున్నాయి. 

ఇదీ ఆన్‌లైన్‌ విధానం..

ఆన్‌లైన్‌లో విద్యాసంస్థ పూర్తి వివరాలు, వాహనం యజమాని వివరాలు (డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూ.ట్రాన్స్‌పోర్టు.తెలంగాణ.జీవోవి.ఇన్‌) అనే వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి. చిన్న వాహనానికి రూ.835, పెద్ద వాహనానికి రూ.1,035 రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది. ఫిట్‌నెస్‌ కోసం స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి. తేదీ, సమయం కేటాయించిన రోజు ఆర్టీఏ కార్యాలయానికి బస్సును తీసుకుని రావాలి. కార్యాలయంలో ఫిట్‌నెస్‌ బృందం బస్సును పూర్తిగా తనిఖీ నిర్వహించి సర్టిఫికెట్‌ జారీ చేస్తారు.

15 ఏళ్లు దాటితే బస్సులు షెడ్లకే..

వాహనం రిజిష్ర్టేషన్‌ అయిన నాటి నుంచి 15ఏళ్ల వరకు మాత్రమే వాహనం రోడ్ల మీద తిరిగే అవకాశం ఉంటుంది. అటువంటి సామర్థ్యం ఉన్న వాహనాలు మాత్రమే విద్యాసంస్థలు కేటాయించాలి. ఫిట్‌నెస్‌ లేని వాహనాలు రోడ్ల మీదికి వస్తే.. వాటిని గుర్తించి సదరు వాహనాలను సీజ్‌ చేస్తారు. దానితో పాటు వాహనా యజమానిపై కేసు నమోదు చేస్తారు.

స్కూల్‌, కాలేజ్‌ల బస్సు సామర్థ్యం ఇలా..

ఉ సదరు విద్యాసంస్థ పేరు, టెలిఫోన్‌ నెంబర్‌, పూర్తి చిరునామా బస్సు ఎడమవైపు, ముందుభాగంలోనూ స్పష్టంగా రాయాలి.

ఉ బస్సు డ్రైవర్‌ అనుభవజ్ఞుడై ఉండి, 60ఏళ్లకు మించరాదు.

ఉ డ్రైవర్‌ ఆరోగ్యస్థితి, కంటిచూపు రికార్డులు సమర్పించాలి.

ఉ బస్సు ఫిట్‌నెస్‌పై ప్రిన్సిపాల్‌, పేరెంట్స్‌ కమిటీ వేసి నెలకోసారి తనిఖీ చేయాలి. బస్సులో కంప్లైంట్‌ బాక్స్‌ ఉంచాలి.

ఉ అత్యవసర ద్వారం, ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌లు తప్పనిసరి. 

ఉ బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థుల వివరాలతో లిస్టు ఉంచాలి.

ఉ విద్యార్థులను పరిమితికి మించి తీసుకెళ్లరాదు.

ఉ నాలుగు చక్రాలు కొత్తవి ఉండాలి, 10 శాతం కన్న ఎక్కువ అరుగుదల ఉండకూడదు. 

ఉ బస్సు క్లచ్‌, బ్రేకులు సరి సరిచూసుకోవాలి. 

ఉ బస్సుకు అద్దాలుండాలి, ఎమర్జెన్నీ డోర్‌ తప్పనిసరి, ప్రాథమిక చికిత్స బాక్సు తప్పనిసరి (బాక్సులో సరిపడా మందులు ఉండాలి), సీట్ల అమరిక విద్యార్థులకు అనుకూలంగా ఉండాలి. 

ఉ చిన్నపిల్లల బస్సులలో 325 సెం.మీ. పైన మెట్లు ఉండాలి. 

ఉ ప్రతీ బస్సుకు ఫస్ట్‌ స్టెప్‌ తప్పనిసరిగా ఉండాలి. సైడ్‌ రీలింగ్‌ అవసరం. బస్సులో నిలువు రాడ్లు ఉండాలి. కుంభాకార దర్పణం (కార్మిక్స్‌ మిర్రర్‌) ఉండాలి. ఈ అద్దం గుండా బస్సులోని పిల్లలను ఎప్పటికప్పుడు డ్రైవర్‌ పరిశీలించవచ్చు. 

ఉ బస్సుకు ఆంపర్‌ లైట్లు ఉండాలి. బస్సును నిలిపినప్పుడు ఈ లైట్లు వెలుగుతూ ఉండాలి. 

ఉ ప్రతీ బస్సులో ఒక సహాకుడు(అటెండెంట్‌) ఉండాలి. ప్రతీ బస్సులో ప్రయాణించే ఆయా పిల్లల వివరాలు, చిరునామా, మొబైల్‌ నెంబర్‌ బస్సులో చార్టు ఏర్పాటు చేయాలి.

ఉ విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రిన్పిపాల్‌ కలిసి నెలకోసారి వాహనాన్ని పరిశీలించాలి. వాహన రిజిష్ర్టేషన్‌ పత్రం, పొల్యూషన్‌ సర్టిఫికెట్‌, పర్మిట్‌ లైసెన్స్‌, ఇన్సూరెన్సుతో పాటు డ్రైవర్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ తప్పనిసరిగా బస్సులో సిద్ధంగా ఉంచుకోవాలి. 

బస్సు డ్రైవర్‌ వివరాలు ఇలా..

డ్రైవర్‌ పేరు, చిరునామా, డ్రైవింగ్‌ లైసెన్స్‌ వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. డ్రైవర్‌కు ప్రతీ మూడు నెలలకు ఒకసారి బీపీ, షుగర్‌, కంటిచూపు పరీక్షలను ఆయా విద్యాసంస్థలు చేయించాలి. 60ఏళ్ల పైబడినవారిని డ్రైవర్లుగా నియమించకూడదు. వాహన డ్రైవర్‌కు ఐదేళ్ల అనుభవం ఉన్నవారినే తీసుకోవాలి. డ్రైవర్‌ అలవాట్లను సైతం విద్యాసంస్థల యజమానులు తరచూ పర్యవేక్షించాలి. (తాగుడు వ్యసనం ఉన్నవారిని విధుల్లోంచి తప్పించాలి). కంటిచూపు, వినికిడి సమస్య ఉన్నవారితో డ్రైవింగ్‌ చేయించరాదు.

సకాలంలో బస్సుల ఫిట్‌నెస్‌ టెస్టు చేయించుకోవాలి

:డాక్టర్‌ కె.వెంకటరమణ, డీటీసీ, నిజామాబాద్‌

బస్సు యజమానులు జీవో నెం. 35 ప్రకారం అన్ని నిబంధనలు పాటించాలి. సుశిక్తుడైన డ్రైవర్‌తో వాహనాలు నడిపించాలి. ఫిట్‌నెస్‌కు ప్రత్యేక కౌంటర్లు, సిబ్బందిని ఏర్పాటు చేశాం. ఫిట్‌నెస్‌ లేని వాహనాలు రోడ్ల మీదకు తీసుకు రావొద్దు. ప్రమాదాలబారిన పడొద్దు. అలాంటి వారిపై కేసులు తప్పవు. మరిన్ని వివరాలకు లేదా ఫిర్యాదులకు నేరుగా సంప్రదించవచ్చు. అలాగే, ఫోన్‌ నెం. 9948788445 ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకు ఆర్టీఏ కార్యాలయంలో అందుబాటులో ఉంటాం.  

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.