ఫిట్‌నెస్‌ అంటే సిక్స్‌ప్యాక్‌ కాదు!

ABN , First Publish Date - 2021-04-11T05:36:43+05:30 IST

‘‘ప్రజలు ఫిట్‌నెస్‌ ఇంపార్టెన్స్‌ అర్థం చేసుకోకపోవడం విచారకరం. సన్నగా ఉండాలని అనుకునేవాళ్ల కోసమే ఫిట్‌నెస్‌ అంటున్నారు. దురదృష్టం ఏమిటంటే...

ఫిట్‌నెస్‌ అంటే సిక్స్‌ప్యాక్‌ కాదు!

‘‘ప్రజలు ఫిట్‌నెస్‌ ఇంపార్టెన్స్‌ అర్థం చేసుకోకపోవడం విచారకరం. సన్నగా ఉండాలని అనుకునేవాళ్ల కోసమే ఫిట్‌నెస్‌ అంటున్నారు. దురదృష్టం ఏమిటంటే... ఇవాళ సన్నగా, ఆరు పలకల దేహంతో ఉండటమే ఫిట్‌నెస్‌’’ అని రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ అన్నారు. ఫిట్‌గా ఉండటం అంటే ఆరోగ్యంగా ఉండటమని అన్నారామె. ఇంకా రకుల్‌ మాట్లాడుతూ ‘‘సిక్స్‌ప్యాక్‌తో ఉన్నారంటే హెల్దీగా ఉన్నారని అర్థం కాదు. నా వరకూ ఎనర్జీగా, స్ట్రాంగ్‌గా ఉండటం ముఖ్యం. స్ట్రాంగ్‌ ఈజ్‌ ద న్యూ సెక్సీ. ప్రతి అమ్మాయి నార్మల్‌ పుష్‌-అప్స్‌ చేసే విధంగా ఉండాలి’’ అని చెప్పారు. ట్రెక్కింగ్‌, సైక్లింగ్‌, అడ్వెంచర్‌ స్పోర్ట్స్‌ వంటి అవుట్‌డోర్‌ యాక్టివీస్‌ చేయడం తనకు ఇష్టమని తెలిపారు. యోగా కూడా చేస్తానన్నారు. మైండ్‌ - బాడీ - సోల్‌ మధ్య బ్యాలెన్స్‌కి యోగా ఉపకరిస్తుందనేది రకుల్‌ చెప్పిన మాట.

Updated Date - 2021-04-11T05:36:43+05:30 IST