కడప(ఎడ్యుకేషన్), జనవరి 16: రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయించిన పీఆర్‌సీని సవరించి ప్రస్తుతం ఇస్తున్న ఐఆర్ కంటే అధికంగా పీఆర్సీ ఫిట్మెంట్ ఇవ్వాలని ఫ్యాప్టో జిల్లా చైర్మన్ వెంకటసుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. కడప నగరం సీఎ్‌సఐ ఉన్నత పాఠవాలలో శనివారం ఫ్యాప్టో ఉద్యమ కా ర్యాచరణలో భాగంగా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిట్మెంట్‌పై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పునరాలోచన చేయాలని కోరారు. ఫ్యాప్టో జిల్లా సెక్రటరీ జనరల్ హరిబాబు, కో చైర్మన్లు రమణారెడ్డి, అబ్దుల్లా, నాయకులు కె.సురే్‌షబాబు పాల్గొన్నారు.