ఫిట్‌మెంట్‌, హెచ్‌ఆర్‌ఏ తగ్గింపు మోసమే: ఫ్యాప్టో

ABN , First Publish Date - 2022-01-19T06:01:44+05:30 IST

ఫిట్‌మెంట్‌, హెచ్‌ఆర్‌ఏ తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉద్యోగులను మోసగించడమేనని ఫ్యాప్టో నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.

ఫిట్‌మెంట్‌, హెచ్‌ఆర్‌ఏ తగ్గింపు మోసమే: ఫ్యాప్టో
పీలేరులో పీఆర్సీ జీవోల దహనం

పీలేరు, జనవరి 18: ఫిట్‌మెంట్‌, హెచ్‌ఆర్‌ఏ తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉద్యోగులను మోసగించడమేనని ఫ్యాప్టో నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం పట్టణ ఎమ్మార్సీ ఎదుట ఫ్యాప్టో ఆధ్వర్యంలో పీఆర్సీ ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. ఎన్నికల ముందు 27శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తామన్న ప్రభుత్వం, ఇప్పుడు మాటతప్పడం దారుణమన్నారు. సీపీఎస్‌ రద్దుకు హామీఇచ్చినా నెరవేర్చక పోవడం అన్యాయమన్నారు. కార్యక్రమంలో ఫ్యాప్టో నాయకులు జగన్మోహన్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, జనార్దనరెడ్డి, అక్రంబాషా, వేణుగోపాల్‌, వెంకటరమణ, అమరనాథరెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, సిద్ధప్ప, సురేంద్ర పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-19T06:01:44+05:30 IST