తాగునీటిలో చేపలు

ABN , First Publish Date - 2020-11-30T06:09:59+05:30 IST

తాగునీటి బావిని కొందరు చేప పిల్లల పెంపకం కేంద్రంగా మార్చారు. పంప్‌ హౌస్‌ పూర్తిగా నిండ టంతో చేప పిల్లలు కుప్పలుగా బయట పడ్డాయి

తాగునీటిలో చేపలు
మృతి చెందిన చేపపిల్లలు

  1. పంప్‌హౌస్‌లో అక్రమ పెంపకం


హొళగుంద, నవంబరు 29: తాగునీటి బావిని కొందరు చేప పిల్లల పెంపకం కేంద్రంగా మార్చారు. పంప్‌ హౌస్‌ పూర్తిగా నిండ టంతో చేప పిల్లలు కుప్పలుగా బయట పడ్డాయి.  గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న ఈ వ్యవహారం బయట పడింది. హొళగుంద మండలం పెద్దహ్యాట గ్రామంలో ప్రభుత్వం పంప్‌ హౌస్‌ని నిర్మించింది. ఇక్కడి నుంచి చిన్నహ్యాట, బీజీహల్లి, ఎల్లార్తి గ్రామాలకు తాగునీరు సరఫరా చేస్తారు. స్వచ్ఛమైన తాగునీటిని ప్రజలకు అందించే ఈ బావిలో కొందరు లక్షల సంఖ్యలో చేప పిల్లలను వదిలారు. పంప్‌హౌస్‌ ఆదివారం పూర్తిగా నిండిపోవడంతో వేల సంఖ్యలో చేపపిల్లలు బయట పడ్డాయి.  సుమారు 600 మీటర్ల దూరం వరకు కొట్టుకు వచ్చాయి. విషయం తెలియగానే ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేపల పెంపకంతో నీరు కలుషితమౌతోందని, వాటిని తాగితే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ వెంకట రమణి తెలిపారు.  

Updated Date - 2020-11-30T06:09:59+05:30 IST