61 రోజులపాటు చేపల వేట నిషేధం..

ABN , First Publish Date - 2021-04-13T06:16:08+05:30 IST

ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఈ నెల 15 నుంచి జూన్‌ 14 వరకు 61 రోజుల పాటు సముద్రంలో యాంత్రిక నావలపై, మర పడవలపై (మెకనైజ్డ్‌, మోటరైజ్డ్‌ బోట్లు) చేపల వేట నిషేధం అమలు కానుందని మత్స్యశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ పీవీ సత్యనారాయణ తెలిపారు.

61 రోజులపాటు చేపల వేట నిషేధం..

మత్స్యశాఖ జేడీ సత్యనారాయణ 

డెయిరీఫారమ్‌ సెంటర్‌(కాకినాడ),ఏప్రిల్‌ 12: ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఈ నెల 15 నుంచి జూన్‌ 14 వరకు 61 రోజుల పాటు సముద్రంలో యాంత్రిక నావలపై, మర పడవలపై (మెకనైజ్డ్‌, మోటరైజ్డ్‌ బోట్లు) చేపల వేట నిషేధం అమలు కానుందని మత్స్యశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ పీవీ సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.  రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబరు 92 జారీ చేసిందన్నారు. ఈ ఉత్తర్వుల దృష్ట్యా మెకనైజ్డ్‌, మోటరైజ్డ్‌ బోట్లు యజమానులు నిర్దేశించిన 61 రోజుల పాటు సముద్రంలో చేపల వేట నిషేఽధాన్ని పాటించాలని కోరారు. ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే వేట నిషేధ భృతి, ఆయిల్‌ సబ్సిడీ రాదన్నారు. అంతే కాకుండా బోట్‌ లైసెన్స్‌ రద్దులతో పాటు ఏపీఎంఆర్‌ఎఫ్‌ యాక్టు కింద కఠినమైన చర్యలు తీసుకుంటామని జాయింట్‌ డైరెక్టర్‌ తెలిపారు. 

Updated Date - 2021-04-13T06:16:08+05:30 IST