మత్స్యకారులను నట్టేట ముంచిన ప్రసన్న

ABN , First Publish Date - 2022-01-20T04:58:27+05:30 IST

రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్యకారులను ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి నట్టేట ముంచారని మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆరోపించారు.

మత్స్యకారులను నట్టేట ముంచిన ప్రసన్న
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి

చంద్రబాబు, లోకేష్‌ త్వరగా కోలుకోవాలని పూజలు


విడవలూరు, జనవరి 19 : రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్యకారులను ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి నట్టేట ముంచారని మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆరోపించారు. మండలంలోని రామచంద్రాపురం పంచాయతీ పాతూరులో బుధవారం జరిగిన గౌరవసభలో రాష్ట్ర తెలుగుయువత ప్రధాన కార్యదర్శి పోలంరెడ్డి దినేష్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం హయాంలో సుమారు రూ.1600కోట్ల నిధులతో మత్స్యకార గ్రామాలను అభివృద్ధి చేశామన్నారు.  తుఫాను షెల్టర్లు, సీసీ రోడ్లు నిర్మించిన ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు.  ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి మత్స్యకార సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారన్నారు. నియోజకవర్గాన్ని మాఫియాగా తయారు చేసి కోట్లాది రూపాయలు దండుకుంటున్నారని ఆయన విమర్శించారు. అనంతరం రాష్ట్ర తెలుగుయువత ప్రధాన కార్యదర్శి దినేష్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి యువతకు పెద్ద పీట వేస్తామని హామీలు ఇచ్చి మోసం చేశారని తెలిపారు. అనంతరం మత్స్యకారులు పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, దినేష్‌రెడ్డిలను ఘనంగా సన్మానించారు. అనంతరం వారు గ్రామంలోని పలువురు టీడీపీ కార్యకర్తలను పరామర్శించారు. 


రామతీర్థంలో ప్రత్యేక పూజలు

కొవిడ్‌ బారిన పడిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌బాబుల ఆరోగ్యం త్వరగా నయం కావాలని కోరుకుంటూ రామతీర్థంలో వెలిసిన  శ్రీకామాక్షి సమేత శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంటు అధికార ప్రతినిధి చెముకుల కృష్ణచైతన్య, మండలాధ్యక్షుడు చెముకుల శ్రీనివాసులు, సోషల్‌ మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యవోలు సత్యంరెడ్డి, మండల ఉపాధ్యక్షుడు ఆవుల రవీంద్ర, మండల బీసీ సెల్‌ ప్రధాన కార్యదర్శి చిన్నిబాబు, మండల ప్రధాన కార్యదర్శి పొన్నాడి చంద్రశేఖర్‌, మాజీ ఎంపీటీసీ ఆవుల రవిచంద్ర, నాయకులు పోలిరెడ్డి, గోపి, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-20T04:58:27+05:30 IST