Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘హెటెరో’ పైప్‌లైన్‌ పనులు ఆపాలని మత్స్యకారులు జలదీక్ష


నక్కపల్లి, డిసెంబరు 7 : హెటెరో యాజమాన్య నిర్మిస్తన్న పైప్‌లైన్‌ను తొలగించాలని డిమాండ్‌ చేస్తూ రాజయ్యపేట తీరంలో మత్స్యకారులు మంగళవారం జల దీక్ష చేపట్టారు. జనసేన రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్‌ మద్దతు ప్రకటించారు. వీరి సమస్యపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని కోరారు. ఇదిలావుంటే, నర్సీపట్నం ఆర్డీవో గోవిందరావు, తహసీల్దార్‌ వీవీ రమణ, నక్కపల్లి సీఐ వి.నారాయణరావు, ఎస్‌ఐ డి.వెంకన్న ఆందోళన చేస్తున్న శిబిరానికి  మంగళవారం విచ్చేశారు. ఈ సందర్భంగా ఆర్డీవో మత్స్యకారులను ఉద్దే శించి మాట్లాడుతూ ఈ పైపులైన్‌కు సంబంధించి సమగ్ర సర్వే జరిపిస్తామని హామీ ఇచ్చారు.  అంతవరకు పైపులైన్‌ నిర్మాణం నిలుపుదల చేయాలని హెటెరో యాజమాన్యాన్ని ఆదేశించినట్టు చెప్పారు. 

Advertisement
Advertisement