సముద్రంలో వేటకు మత్స్యకారులు సన్నద్ధం

ABN , First Publish Date - 2021-06-15T05:11:41+05:30 IST

సముద్రంలో వేటకు మత్స్యకారులు సన్నద్ధమయ్యారు.

సముద్రంలో వేటకు మత్స్యకారులు సన్నద్ధం
తీరానికి చేరుకున్న బోట్లు

నరసాపురం, జూన్‌ 14: సముద్రంలో వేటకు మత్స్యకారులు సన్నద్ధమయ్యారు. గత ఏప్రిల్‌ 15 నుంచి 60 రోజుల పాటు సముద్రంలో వేట నిషేధం గడువు సోమవారం అర్థరాత్రితో ముగిసింది. ఈ కాలంలో సముద్రంలో మత్స్య సంపద పునరు త్పత్తి జరుగుతుంటుంది. ఈ సమయంలో వేట సాగిస్తే మత్య సంపద హరించిపో తుందనే ఉద్దేశంతో ఏటా నిషేధం విధించండం అనవాయితీ. నరసాపురం, మొగ ల్తూరు తీరంలో వేట సాగలేదు. నిషేధ ఆజ్ఞలు ముగియడంతో తీరానికి బోట్లు చేరుకుంటున్నాయి. స్థానిక మత్స్యకారులతో పాటు కాకినాడ, నెల్లురు, మచిలీపట్నం, నిజంపట్నం నుంచి బోట్లు తీరానికి చేరుకుంటున్నాయి. ఈ ఏడాది ముందుగానే గోదావరికి వరద తాకుతుండడంతో మత్య సంపద పుష్కలంగా లభిస్తుందనే అశతో మత్స్యకారులు వేటకు సిద్ధమవుతున్నారు.

Updated Date - 2021-06-15T05:11:41+05:30 IST