అక్రమ వెంచర్లపై మత్స్యకారుల నిరసన

ABN , First Publish Date - 2022-01-19T04:28:05+05:30 IST

చెరువుల్లో ఎఫ్‌టీఎల్‌ పరిధి దాటి అక్రమ వెంచర్లు చేస్తున్న విషయంపై మంగళవారం మండల మత్స్య పారిశ్రామిక సంఘం ఆధ్వర్యంలో మత్స్యకారులు చెరువు దగ్గర చేస్తున్న వెంచర్లను అడ్డుకున్నారు.

అక్రమ వెంచర్లపై మత్స్యకారుల నిరసన
తెలకపల్లి పెద్దచెరువు వద్ద మత్స్యకారులతో మాట్లాడుతున్న ఇరిగేషన్‌ ఈఈ సంజీవరావు

- స్పందించిన ఇరిగేషన్‌ ఈఈ సంజీవరావు

- ఎఫ్‌టీఎల్‌ బౌండరీలు ఏర్పాటు చేస్తాం

- భూఆక్రమణదారులపై కేసులు పెడతాం

- ఈఈ హామీతో నిరసన విరమణ


తెలకపల్లి, జనవరి 18 : చెరువుల్లో ఎఫ్‌టీఎల్‌ పరిధి దాటి అక్రమ వెంచర్లు చేస్తున్న విషయంపై మంగళవారం మండల మత్స్య పారిశ్రామిక సంఘం ఆధ్వర్యంలో మత్స్యకారులు చెరువు దగ్గర చేస్తున్న వెంచర్లను అడ్డుకున్నారు. చెరువు భూములను కాపాడాలని కోరుతూ ఘటనా స్థలంలో కూర్చొని నిరసన వ్య క్తం చేశారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్‌ శ్రీనివాసులు చెరువు వద్దకు వెళ్లగా, ఆయన ముందూ నిరసన వ్యక్తం చేశా రు. విషయం జిల్లా ఇరిగేషన్‌ అధికారులకు తెలియడంతో స్పందించిన నాగర్‌కర్నూల్‌ జిల్లా ఇరిగేషన్‌ ఈఈ సంజీవరావు ఘటనా స్థలానికి వెళ్లారు. మండల కేంద్రంలోని పెద్దచెరువు, పరిధిలోని దాసుపల్లి గ్రామంలో చెరువుల ఎఫ్‌టీఎల్‌ దాటి వెంచర్లు చేస్తున్న వారిపై ఇరిగేషన్‌ శాఖ ఆధ్వర్యంలో కేసులు పెడతామని, అక్రమ వెంచర్లను ఆపాలని లేకపోతే నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ అక్రమ నిర్మాణాలపై తహసీల్దార్‌ ఎస్‌.శ్రీనివాసులుకు, ఎస్సై మాధవ రెడ్డిలకు ఇరిగేషన్‌ తరపున ఫిర్యాదు చేసి కేసులు పెడతామని ఈఈ తెలిపారు. అక్రమ వెంచర్ల తీరును సంఘం సభ్యులు, మత్స్యకారులు చెరువుల వద్దకు తీసుకెళ్లి ఈఈకి, తహసీల్దార్ల కు చూపించారు. ఇరిగేషన్‌ ఈఈ సంజీవరావు మాట్లాడుతూ ఇరిగేషన్‌ జేఈకి ప్రస్తుతం కరోనా పాజిటివ్‌ రావడం వల్ల ఎఫ్‌టీఎల్‌ బౌండరీ ఏర్పాటు ఆలస్యమైందని త్వరలోనే ఏర్పాటు చేస్తామని మత్స్యకారులకు హామీ ఇచ్చారు. చెరువు లో ఎలాంటి నిర్మాణాలు చేయరాదని తహసీల్దార్‌ను హెచ్చ రించి వారితో రాతపూర్వక హామీ తీసుకోవడంతో మత్స్యకారు లు నిరసన విరమించారు. కార్యక్రమంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ చందానాయక్‌, ఉప సర్పంచ్‌ ఆర్‌.కృష్ణయ్య, మాజీ ఉప సర్పంచ్‌ ఎం.బాలగౌడ్‌, సంఘం సభ్యులు, మత్స్యకారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-19T04:28:05+05:30 IST