Abn logo
Sep 27 2021 @ 00:27AM

మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు

ముత్యాలమ్మపాలెం తీరంలో పర్యటిస్తున్న తహసీల్దార్‌ బీవీ రాణి

తహసీల్దార్‌ బీవీ రాణి

పరవాడ, సెప్టెంబరు 26: గులాబ్‌ తుఫాన్‌ నేపథ్యంలో మత్స్యకారులెవరూ సముద్రంలో వేటకు వెళ్లవద్దని తహసీల్దార్‌ బీవీ రాణి హెచ్చరించారు. ఆదివారం ఆమె మత్స్యకార గ్రామాలైన ముత్యాలమ్మపాలెం, తిక్కవానిపాలెంలో పర్యటించారు. తుఫాన్‌ ముప్పు ఉందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని మత్స్యకారులంతా వేటకు వెళ్లకుండా ఇళ్ల వద్దే ఉండాలన్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉందని, అందుచేత మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరానికి వెళ్లొద్దన్నారు. ఎలాంటి సహాయం కావాలన్నా వెంటనే తమకు సమాచారం తెలియజేయాలన్నారు. అనంతరం ఆమె  ఈరంలో పర్యటించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఆమె వెంట పంచాయతీ కార్యదర్శి సోమినాయుడు, వీఆర్‌వో అప్పారావు, సచివాలయ సిబ్బంది వున్నారు. అలాగే సీఐ సూర్యనారాయణ సిబ్బందితో కలిసి ముత్యాలమ్మపాలెం, తిక్కవానిపాలెం తీరంలో పర్యటించారు. మత్స్యకారులంతా అప్రమత్తంగా వుండాలని సూచించారు.