Abn logo
Sep 21 2021 @ 00:45AM

మత్స్యకారుల ధర్నా

ధర్నా నిర్వహిస్తున్న మత్స్యకారులు
భానుగుడి(కాకినాడ), సెప్టెంబరు 20: మత్య్సకారుల  వృత్తికి విఘాతం కలిగించే ఆన్‌లైన్‌ వేలం ప్రక్రియకు సంబంధించిన జీవో నెం 217ను రద్దు చేయాలని కోరుతూ మత్స్యకారులు సోమవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే కొండబాబు, బీజేపీ నాయకులు కర్రి చిట్టిబాబు, మత్య్సకారుల ఐక్య కార్యాచరణ సమితి రాష్ట్ర కన్వీనర్‌ అంపోలు సత్యనారాయణ, నాగిడి నాగేశ్వరరావు, రమణ మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నదులు, జలాశయాలు, చెరువులు, రిజర్వాయర్లు, కుంటల మీద ఆధారపడి  జీవనం సాగిస్తున్న మత్స్యకారుల జీవనోపాధిని కొల్లగొడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బడాబాబుల ప్రయోజనాల కోసమేనని విమర్శించారు. నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేవరకు పార్టీలకు అతీతంగా పోరాడి రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార సంఘాల సభ్యులు, మత్య్సకార నాయకులు, వాడ్రేవు వీరబాబు, తుమ్మల రమేష్‌, సేరు చిన్న తదితరులు పాల్గొన్నారు.