ఆ క్షణంలో మత్స్యకారులు దానిని చూసి నోరెళ్లబెట్టారు.. సమీపంలోని వారు గుడ్లప్పగించి చూశారు.. ఇంతలో జనం తండోపతండాలుగా వచ్చి..

ABN , First Publish Date - 2021-10-19T17:50:17+05:30 IST

సముద్రం తనలో ఎన్నో రహస్యాలను దాచుకుంది.

ఆ క్షణంలో మత్స్యకారులు దానిని చూసి నోరెళ్లబెట్టారు.. సమీపంలోని వారు గుడ్లప్పగించి చూశారు.. ఇంతలో జనం తండోపతండాలుగా వచ్చి..

సముద్రం తనలో ఎన్నో రహస్యాలను దాచుకుంది. వేలాది జీవరాసుల నిలయం సాగర గర్భం. అందుకే సాగరం నుంచి అప్పుడప్పుడు భారీ జీవులు బయటపడుతుంటాయి. ఇటీవల సముద్రం నుంచి వెలికి వచ్చిన అత్యంత భారీ చేప గురించిన వివరాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అమెరికాకు చెందిన మత్య్సకారులు అత్యంత భారీ పరిమాణంలో ఉన్న చేపను పట్టుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటో ఇప్పుడు వైరల్‌గా మారింది. 


ఈ భారీ చేప ఒక కారు పరిమాణంలో ఉంది. దీనిని ఒడ్డుకు తీసుకువచ్చేందుకు మత్స్యకారులు ఎంతో శ్రమించారు. దానితో ఫొటోలు తీసుకున్న తరువాత ఆ భారీ చేపను తిరిగి సముద్రంలో విడిచి పెడ్డారు. ఆ ప్రాంతానికి చెందిన ఢాక్టర్ బ్లాక్ కొచరన్ మీడియాతో మాట్లాడుతూ.. చేపలు పట్టేందుకు సముంద్రంలోకి వల వేసిన మత్స్యకారులకు ఏదో భారీ చేప పడినట్లు అనిపించందన్నారు. వారు దానిని అతికష్టంమీద ఒడ్డునకు తీసుకువచ్చి ఆశ్చర్యపోయారన్నారు. కారు పరిమాణంలో ఉన్న ఆ చేపను చూసి ఇక్కడున్నవారంతా కంగుతిన్నారన్నారు. తరువాత మత్స్యకారులు ఆ చేపను తిరిగి సముద్రంలో విడిచిపెట్టారని తెలిపారు. 


Updated Date - 2021-10-19T17:50:17+05:30 IST