తీరానికి కొట్టుకు వచ్చిన మత్స్యకారుల బోటు

ABN , First Publish Date - 2020-08-07T10:19:33+05:30 IST

ఫిషింగ్‌ హార్బర్‌ నుండి చేపల వేటకు వెల్లిన బోటు ప్రమాదానికి గురైంది.

తీరానికి కొట్టుకు వచ్చిన మత్స్యకారుల బోటు

యాంకర్‌ తెగిపోవడంతో ప్రమాదం

ఎనిమిది మంది మత్స్యకారులు సురక్షితం


వన్‌టౌన్‌, ఆగస్టు 6: ఫిషింగ్‌ హార్బర్‌ నుండి చేపల వేటకు వెల్లిన బోటు ప్రమాదానికి గురైంది. హార్బర్‌లోని నర్సింహమూర్తికి చెందిన బోటు నాలుగు రోజుల క్రితం 8 మందితో వేటకు వెళ్లింది. వేట ముగించుకుని బుధవారం రాత్రి తిరిగి వస్తున్న మత్స్యకారులు బీమిలి మండలం అన్నవరం ప్రాంతనికి 50 కిలోమీటర్లు దూరంలో బోటుకు యాంకర్‌వేసి నిద్రలోకి జారుకున్నారు. సముద్రంలో ఈదురు గాలుల కారణంగా యాంకర్‌ తెగిపోయి బోటు అన్నవరం సాగరతీరానికి కొట్టుకొచ్చింది.


మేలుకున్న మత్స్యకారులు చూసేసరికి సాగరతీరం ఒడ్డుకు చేరుకుని ఉంది. దీంతో వారంతా బోటు నుంచి దూకి ఒడ్డుకు చేరుకున్నారు. సమాచారం అందుకున్న బోటు యజమాని ఘటనా స్థలానికి చేరుకుని టాక్టర్లు, కేన్‌ సహాయంతో బోటును బయటకు లాగే ప్రయత్నం చేశాడు. అయితే అతని ప్రయత్నం ఫలించలేదు. తనకు జరిగిన నష్టానికి ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు.

Updated Date - 2020-08-07T10:19:33+05:30 IST