Abn logo
Sep 15 2021 @ 23:55PM

చేపల పెంపకంతో గిరిజనులకు ఉపాధి

మత్స్య శాఖ జిల్లా అధికారి వీరన్న

వాజేడు, సెప్టెంబరు 15:  మత్స్య శాఖ సొసైటీల ఏర్పాటు ద్వారా చేపల పెంపకంతో గిరిజనులు మెరుగైన ఉపాధి లభిస్తుందని మత్స్య శాఖ జిల్లా అధికారి బానోత్‌ వీరన్న అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో మత్స్య శాఖ సొసైటీల ఏర్పాటుపై రెవెన్యూ, జీపీ కార్యదర్శులు, ఫారెస్టు అధికారులు, స్థానిక జాలర్లతో ఆయన  బుధవారం సమావేశమయ్యారు.  ఏజెన్సీలోని చెరువులలో చేపల పెంపకం, అమ్మకంపై గిరిజనుల నుంచి సొసైటీలు ఏర్పాటుపై చర్చించారు. 21 మంది సభ్యులతో సొసైటీలు ఎన్నుకోవడం ద్వారా ఆర్థికాభివృద్ధిని సాధించొచ్చన్నారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలు సైతం నేరుగా సొసైటీలకు అందుతా యన్నారు. ఇందుకు గ్రామాల్లోని చెరువులను గుర్తించి భూములున్న రైతులను సొసైటీలుగా ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. సమావే శంలో తహసీ ల్దార్‌ రాజ్‌కుమార్‌, డిప్యూటీ సీఈవో చంద్రశేఖర్‌, ఐటీడీఏ పెసా కోఆర్డినేటర్‌ కొమురం ప్రభాకర్‌, ఎంపీవో లక్ష్మీనారా యణ, ఫిషరీష్‌ ఫీల్డ్‌ ఆఫీసర్‌ పాముల రమేష్‌, ఎఫ్‌ ఆర్‌వో చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. 

దరఖాస్తుల ఆహ్వానం : జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌

 తాడ్వాయి : జిల్లాలోని షెడ్యూల్డ్‌ ప్రాంతంలో అనువైన చెరువుల్లో చేపల పెంపకానికి గిరిజన మత్స్య, పారిశ్రామిక సంఘాల సమాఖ్య ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోవాలని జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ బడే నాగజ్యోతి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్హులైన గిరిజన మత్స్యకారులు ఈనెల 18 లోపు జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో దరఖాస్తులు అందించాలని పేర్కొన్నారు.