జీవనోపాధికి గండి

ABN , First Publish Date - 2020-11-23T04:29:39+05:30 IST

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ మండలం వెంకటాపూర్‌ తాళ్లకుంట చెరువుకు గండిపడింది.

జీవనోపాధికి గండి
గండి పడిన వెంకటాపూర్‌ తాళ్లకుంట చెరువు (ఫైల్‌)

  • ఇటీవలి భారీ వర్షాలకు తెగిన తాళ్లకుంట చెరువుకట్ట 
  • నీటితోపాటు చేపలన్నీ పోవడంతో తీవ్రంగా నష్టపోయిన మత్స్యకారులు
  • పరిహారం చెల్లించి ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు


ఘట్‌కేసర్‌ రూరల్‌ : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ మండలం వెంకటాపూర్‌ తాళ్లకుంట చెరువుకు గండిపడింది. దీంతో చెరువులోని నీటితో పాటు చేపలన్నీ వెళ్లిపో యాయి. దాదాపు 46 ఎక రాల విస్తీర్ణంలో ఈ చెరువు ఉంది. అయితే గతనెల 17న అర్ధరాత్రిన భారీ వర్షా నికి చెరువు కట్టకు గండిప డింది. ఉదయం మత్స్యకా రులు వచ్చి చూసేసరికి చెరువులోని నీటితోపాటు చేప లన్నీ బయటకు వెళ్లిపోయాయి. గండి పడినచోట చేపలు పట్టడా నికి ప్రయత్నించినా ప్రవాహ ఉధృతి ఎక్కువగా ఉండటంతో వీలు పడలేదు. దీంతో చెరువులోని చేపలన్నీ కిందికి వెళ్లిపోయాయి. దాదాపు 150 కుటుంబాలు ఈ చెరువుపై ఆధారపడి జీవనోపాధి పొందు తుంటాయి. శ్రీబాలాజీ మత్స్యకార సహకార సం ఘంలో 106మంది సభ్యత్వం పొంది ఉన్నారు. వీరంతా మూడునెలలకు ఒకసారి చేపలు పట్టి నగరంలో విక్రయిస్తారు. చేపలు పట్టేరోజు తప్పనిసరిగా సభ్యులు హాజరవుతారు. ప్రతి మృగశిర కార్తె నాడు చేపలు పట్టి మరుసటి రోజు లెక్కలు చేసి డబ్బు పంచుకోవటం ఆన వాయితీగా వస్తుంది. సభ్యులకు ఒక్కొక్కరికి దాదాపు రూ. 35 వేల నుంచి 40 వేల వరకు వస్తాయి. భారీవర్షాలకు చెరువుకట్టకు గండిపడి తీవ్ర నష్టం వాటిల్లిందని మత్స్యకారులు వాపోతున్నారు. వర్షాలు రాకముందే రూ.10లక్షలు ఖర్చుపెట్టి ఆంధ్రప్రదేశ్‌లోని కైకలూరు నుంచి చేపపిల్లలను కొనుగోలు చేసి చెరువులో వదిలి పెట్టామని, అంతకు ముందు దాదాపు యాబై లక్షల విలువ చేసే చేపలుండేవని, కట్ట తెగిపోయి చేపలన్నీ నీటి ప్రవాహంలో పోయి తమకు నష్టాన్ని మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువుకట్ట ఎత్తు పెంచి, అలుగు వెడల్పుగా నిర్మాణం చేయాలని మత్స్యకారులు కోరుతున్నారు. చెరువుకట్టకు త్వరగా మరమత్తులు చేపట్టి చెరువులో నీరునింపి చేప పిల్లలను వదలాలని, ప్రభుత్వం తమకు పరిహారం అందించి ఆదుకోవాలని మత్సకారులు కోరుతున్నారు. 


ప్రభుత్వం ఆదుకోవాలి


చెరువుకట్టకు గండిపడి నీటితోపాటు చేపలు, చేపపిల్లలు కిందికి వెళ్లిపోయాయి. దీంతో 150 మత్స్యకారుల  కుటుంబాలు జీవనోపాధికి కష్టం వచ్చింది. చేపలు పట్టి జీవనం సాగించే మాకు ప్రస్తుతం చెరువులో చుక్కనీరు లేదు. ప్రభుత్వం మా గ్రామంలోని మత్స్యకారులను ఆదుకోవాలి. 


- నీరుడి రామారావు, మత్స్యకారుడు, వెంకటాపూర్‌


కట్టకు నాణ్యమైన మరమ్మతులు చేపట్టాలి


చెరువుకట్టకు వెంటనే మరమ్మతులు చేప ట్టాలి. తాత్కాలికంగా కాకుండా శాశ్వత మర మ్మతు పనులు చేపట్టాలి. చెరువు నిండిన ప్పుడు నీరు బయటకు వెళ్లడానికి అలుగు నిర్మాణం పెద్దగా చేపట్టాలి. 


- రాముముదిరాజ్‌, మత్స్యకారుడు, వెంకటాపూర్‌


తీవ్ర నష్టం వచ్చింది 


చేపలన్నీ పోయి తీవ్ర నష్టం వచ్చింది. చేపలు విక్రయిస్తే ఒక్కొ సభ్యునికి దాదాపు 35 వేలు వచ్చేది. అంతేకాకుండా కొనుగోలు చేసి తెచ్చిన చేపపిల్లలు సైతం కిందికి వెళ్లిపోయాయి. ప్రభుత్వం అదుకునే విధంగా చూడాలి. 


- ఎన్‌. రవి, మత్స్యకారుడు, వెంకటాపూర్‌


చెరువుకట్టకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టాం 


తాళ్లకుంట చెరువుకట్టకు తాత్కాలిక మరమ్మ తులు చేపట్టాం. గత కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు చెరువుకట్ట మరమ్మతులకు నిధులు ఇస్తామ న్నారు. అంతలోనే బదిలీపై వెళ్లారు. చెరువుకట్ట ఎత్తు తక్కువగా ఉంది. ఎత్తు, అలుగు వెడల్పు, కట్టకు లోపల రాతికట్టడం వంటివి శాశ్వతంగా ఉండే విధంగా ప్రణాళిక సిద్ధం చేసి పై అధికారులకు నివేదిక పంపాం. 


- అరిగే పరమేష్‌, ఇరిగేషన్‌ ఏఈ



Updated Date - 2020-11-23T04:29:39+05:30 IST