కొల్లేరు కాంటూరులో చేపల చెరువు తవ్వకం

ABN , First Publish Date - 2022-06-28T05:30:00+05:30 IST

గుడిపాడు గ్రామ సమీపంలోని కొల్లేరు కాంటూరు పరిధిలో అనధికార చేపల చెరువుల తవ్వకాలు జరుపుతున్న ఒక ఎక్స్‌కవేటర్‌ను సీజ్‌ చేసి తవ్వకాలు నిలుపుదల చేసినట్లుగా ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసరు గంగారత్నం తెలిపారు.

కొల్లేరు కాంటూరులో చేపల చెరువు తవ్వకం
కాంటూరు పరిధిలో చేపల చెరువులకు ఎక్స్‌కవేటర్‌తో గట్లు వేస్తున్న దృశ్యం

 అడ్డుకుని యంత్రాన్ని సీజ్‌ చేసిన అధికారులు

పెదపాడు, జూన్‌ 28 : గుడిపాడు గ్రామ సమీపంలోని కొల్లేరు కాంటూరు పరిధిలో అనధికార చేపల చెరువుల తవ్వకాలు జరుపుతున్న ఒక ఎక్స్‌కవేటర్‌ను సీజ్‌ చేసి తవ్వకాలు నిలుపుదల చేసినట్లుగా ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసరు గంగారత్నం తెలిపారు. కొల్లేరు కాంటూరు పరిధిలో సుమారు 12 ఎకరాల విస్తీర్ణంలో చెరువు తవ్వకం పనులు ప్రారంభించారని, తవ్వకాలకు సంబంధించి ఎవరికి అనుమతులు లేవన్నారు. 


Updated Date - 2022-06-28T05:30:00+05:30 IST