చేప పిల్లలు రెడీ

ABN , First Publish Date - 2021-06-24T04:38:19+05:30 IST

జలాశయాలు, చెరువులు, కుంటల్లో చేప పిల్లల విడుదల కు రంగం సిద్ధమైంది.

చేప పిల్లలు రెడీ
సంగాల రిజర్వాయర్‌లో చేప పిల్లలను వదులుతున్న ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి (ఫైల్‌)

- జోగుళాంబ గద్వాల జిల్లాలో 2.48 కోట్ల చేప పిల్లల విడుదలకు ప్రణాళిక

- ఈ ఏడాది 611 చెరువులు, కుంటలను గుర్తించిన మత్స్య శాఖ


(గద్వాల-ఆంధ్రజ్యోతి) : జలాశయాలు, చెరువులు, కుంటల్లో చేప పిల్లల విడుదల కు రంగం సిద్ధమైంది. ఇందు కోసం మత్స్య శాఖ టార్గెట్‌ నిర్దేశించుకున్నది. జోగుళాం బ గద్వాల జిల్లాలో ఈ ఏడాది 2.48 కోట్ల చేప పిల్లలను విడుదల చేయాలని ప్ర ణాళిక రూపొందించుకోగా, ఇప్పటికే కాంట్రాక్ట్‌లను కూడా ఖరారు చేసింది. వరదలు, వర్షాలు ప్రారంభమై జలాశయాలు, రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు నిండితే వెం టనే చేప పిల్లలను విడుదల చేసేందుకు సన్నద్ధమైంది.


భారీగా లక్ష్యం

చేప పిల్లలను వదలడానికి జిల్లాలో భారీ లక్ష్యాన్ని అధికారులు నిర్దేశించుకున్నారు. ఈ ఏడాది ఇప్పటికే 611 చెరువులు, కుంటలను గుర్తించారు. వీటితో పాటు జూరాల, బీచుపల్లి, ర్యాలంపాడు, సంగాల, జమ్ములమ రిజర్వాయర్లలో చేప పిల్లలను విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు 2.48 కోట్ల చేప పిల్లలను సిద్ధంగా ఉంచగా, ఇందులో 35-40 ఎంఎం సైజ్‌ చేప పిల్లలు 1.05 కోట్లు, 80-100 ఎంఎం సైజ్‌ చేప పిల్లలు 1.28 కోట్లు ఉన్నాయి. గతేడాది జిల్లాలో 1.15 కోట్ల చేప పిల్లలను విడుదల చే శారు. వీటి ద్వారా 820 మెట్రిక్‌ టన్నుల చేపలు ఉత్పత్తి అయ్యాయి. మొత్తం రూ.61.22 లక్షల దిగుబడులు వచ్చాయి.


వరదపైనే ఆశలు

జిల్లాలో ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం నమోదు కాలేదు. అయితే, జూరాల ప్రాజెక్టుకు మాత్రం ఈ నెల మొదట్లో స్వల్పంగా ఇన్‌ఫ్లో నమోదైంది. దీంతో ఈ ప్రాజె క్టుకు అనుబంధంగా ఉన్న కాలువలకు, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి నీటిని వి డుదల చేస్తున్నారు. ఇప్పటికే రిజర్వాయర్లు సగం సామర్థ్యానికి చేరుకున్నాయి. తా జాగా ఆల్మట్టి, నారాయణపూర్‌ నుంచి కూడా జూరాలకు ఇన్‌ఫ్లో నమోదవుతోంది. మ రికొన్ని రోజులు వరద కొనసాగితే జూరాల ఆధారంగా ఉన్న రిజర్వాయర్లు పూర్తిగా నిండే అవకాశం ఉన్నది. వీటి పరిధిలోని చెరువులకు కూడా నీటి ఎత్తిపోసుకునే వీ లుంది. ఆలోపు చేప పిల్లల విడుదలకు మత్స్య శాఖ కార్యాచరణ చేపట్టింది. జిల్లాలో 2.48 కోట్ల చేప పిల్లలను విడుదల చేసేందుకు లక్ష్యం పెట్టుకోగా, నాగర్‌కర్నూల్‌లో 2.95 కోట్ల చేప పిల్లలను, వనపర్తిలో 3.50 కోట్లు, మహబూబ్‌నగర్‌లో 2.52 కోట్లు, నారాయణపేటలో 1.84 కోట్ల చేప పిల్లల విడుదలకు మత్స్య శాఖ సిద్ధమవుతోంది.

Updated Date - 2021-06-24T04:38:19+05:30 IST