చేపల చిచ్చు

ABN , First Publish Date - 2021-07-31T07:11:42+05:30 IST

చేపల పంచాయతీ కారణంగా ఆ ఊరు రెండుగా చీలిపోయింది. ఈ పంచాయితీ తీర్చలేక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కూనవరం మండలం పొట్లవాయిగూడెం గిరిజన గ్రామం అది. ఈ ఊరు శివారున ఒక చెరువు ఉంది.

చేపల చిచ్చు
వివాదంగా మారిన చేపలచెరువు

  • ఊరి చెరువు చేపల పంపకాల్లో విభేదాలు 
  • పంచాయితీ తీర్చలేక తలలు పట్టుకున్న అధికారులు

కూనవరం, జూలై 30: చేపల పంచాయతీ కారణంగా ఆ ఊరు రెండుగా చీలిపోయింది. ఈ పంచాయితీ తీర్చలేక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కూనవరం మండలం పొట్లవాయిగూడెం గిరిజన గ్రామం అది. ఈ ఊరు శివారున ఒక చెరువు ఉంది. అందులో అదే గ్రామానికి చెందిన జోగ య్యతోపాటు మరికొంతమంది కలసి చేపల పెంపకం చేపటా ్టరు. కొంతకాలం తర్వాత చేపలు పెద్దవి కావడంతో వాటిని ప ట్టేందుకు జోగయ్య వర్గీయులు సిద్ధమయ్యారు. అదే గ్రామా నికి చెందిన లక్ష్మీనారాయణ వర్గీయులు చేపలు పట్టకుండా వారిని అడ్డుకున్నారు. ఇది ఊరి చెరువు కాబట్టి ఈ చేపల పంపకాల్లో అందరికీ వాటా ఉంటుందని, ఊరందరికీ సమా నంగా పంచాలని లక్ష్మీనారాయణ వర్గీయుల వాదిస్తున్నారు. తాము సొంత ఖర్చులతో చేపల పెంపకం చేపట్టామని, ఇవి తమకే చెందుతాయని జోగయ్య వర్గీయులు చెబుతున్నారు. ఈ వివాదంతో పోలీసులు సైతం గ్రామంలోకి రంగప్రవేశం చేశారు. అప్పటి సీఐ గీతా రామకృష్ణ ఇరువర్గాలను పిలిచి మాట్లాడినా ఫలితం లేకుండా పోయింది. ఆయన ఒక వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మరోవర్గం పోలీస్‌ ఉన్నతా ధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ వివాదం కాస్తా ఆ ఊరి బంధాలు, బంధుత్వాలపై కూడా పడింది.ఈ చేపల వివాదాలు కారణంగా ఒకవర్గంలో శుభకార్యం జరిగితే ఆ ఊర్లో ఇంకో వ ర్గం వాళ్లను పిలుచుకోవడం లేదు. ఇటీవల ఆ గ్రామానికి చెం దిన యువకులు చెరువు దగ్గర కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఆ గ్రామ సచివాలయం పోలీ స్‌ రంగప్రవేశంతో ఆ వివాదం సద్దుమణిగింది. ఈ వివాదాన్ని అధికారులు చింతూరు ఐటీడీఏ పీవో దృష్టికి తీసుకవెళ్లారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని గ్రామంలో ఉన్న చేపల చెరువు వివాదాన్ని పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.                

వేలంపాట నిర్వహిస్తాం: ఎంపీడీవో

కొన్నినెలలుగా పొట్లాయిగూడెం చేపలచెరువు వివాదంగానే మారిందని ఎంపీడీవో సత్యనారాయణమూర్తి తెలిపారు. ఆ గ్రామానికి చెందిన ఇరువర్గాల చేపల పంపకాల్లో వివాదాలు తలెత్తాయని, ఈ కారణంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇరువర్గాలకు చెందకుండా ఈ చేపల చెరువును వేలంపాట నిర్వహిస్తామని ఆయన తెలిపారు.

Updated Date - 2021-07-31T07:11:42+05:30 IST