మినుము రైతు కష్టాలు

ABN , First Publish Date - 2022-01-26T04:48:26+05:30 IST

అందరికీ అన్నం పెట్టే అన్నదాతకు ఈ ఏడాది నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు.

మినుము రైతు కష్టాలు
సాగు చేసిన మినుము పైరు

గణనీయంగా తగ్గిన 

దిగుబడులు, ధరలు

1500 ఎకరాల్లో సాగు 

కోత కూలీలు కూడా రాని ధైన్యం   

పెద్ద దోర్నాల, జనవరి 25 : అందరికీ అన్నం పెట్టే అన్నదాతకు ఈ ఏడాది నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. ఏ పైరు  వేసినా కష్టా లు, నష్టాలు తప్పడం లేదు. దీంతో అప్పులే మిగులుతున్నాయి. ఏయేటికాయేడు అప్పులఊబి నుంచి బ యటపడదామనుకున్నా మరింత అప్పులపాలవుతున్నాడు. ఖరీఫ్‌ సీజన్‌ రాకుండానే వేసవిలో మంచి భారీ వర్షం కురిసింది. దీంతో అన్నదాతల్లో ఆశలు రేకెత్తాయి. ఈ ఏడాది కాలం అనుకూలంగా ఉందని భ్రమపడ్డాడు. అధిక సంఖ్యలో రైతులు గత అనుభవాల ను పెట్టుకుని పత్తి సాగు చేయలేదు. కేవలం 700 ఎకరాల్లో మాత్రమే పత్తి సాగు చేశారు. ఒక పంట మాత్రమే వచ్చింది. మార్కెట్‌ పత్తి క్వింటాలు ధర రూ.8,000 వరకు పలికినా స్థానికంగా రూ.6,500కు మించి కొనుగోలు చేయలేదు. గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. పత్తి రెండో పంట రాలేదు. 

పది పదిహేను రోజుల పాటు ఎడతెరిపి లేకుండా ముసురు వాన కురిసింది. ఏ చెరువు, కుంటలకు నీరు చేరలేదు. కానీ సాగు చేసిన పత్తి, మిరప పంటలు మాత్రం పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో చాలా మంది రైతులు మిరప, ప త్తిని తొలగించి మినుము సాగు చేశారు. మినుము మొలిచిన పక్షం రోజుల నుంచీ మళ్లీ ముసురు వాన వారం, పది రోజులుకురిసింది. దీంతో మినుము కూడా కలుపుగడ్డితో కలిసి పోయి పైరుకు ఎక్కడా లేని తెగుళ్లు సోకాయి. అయినా అలసిపోకుండా రైతులు పైరుపై రసాయనిక మందులు విచ్చలవిడిగా పిచికారీ చేశారు. ఫలితం కనిపించలేదు. ఎకరా మినుము సాగుకు రూ.10,000 నుంచి రూ.20,000 వరకు ఖర్చు చేశారు. కొందరివి చెట్టుకు నాలుగైదు కాయలు కాసాయి. కొందరివి పూర్తిగా గిడసబారి పోయి మొద్దుల్లా మారాయి. ఆ రైతులు కోతలు కోయ కుండా భూమి మీదనే వదిలేశారు. కానీ కొద్దో గొప్పో కాచిన పైరు పంట కోతలు కోయాలంటేనే జంకుతున్నారు. కోత కూలీలు కూడా రావని ఆందో ళన వ్యక్తం చేస్తున్నారు. ఎకరం కోతలు కోయాలంటే 5 మంది కూలీలు అవసరమవుతారు. ఒక్కొక్కరికి ఎంత లేదన్నా రూ.500 ఇవ్వాల్సి ఉంటు ంది. మళ్లీ కుప్ప వేసి నూర్పిళ్లు చేయాలంటే అధనంగా ఖర్చవుతోంది. పోనీ మిషన్‌తో కోత, నూర్పిళ్లు చేస్తే గంట కు రూ.2,100 చెల్లించాల్సి వస్తోంది. తప్పదని కోతలు చేస్తే ఎక్కువ మంది రైతులకు ఎకరానికి ఒకటి, రెండు క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వస్తోంది. 

తగ్గిన ధరలు, దిగుబడులు

సాధారణంగా వాతావరణం అనుకూలిస్తే ఎకరాకు 8 నుంచి 12 క్వింటాల్లు దిగుబడులు వస్తాయి. మొ న్నటి వరకు ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. క్వింటాలు ధర రూ.7,200 వరకు పలికాయి. ఈ ఏడాది ముసురు వానకు పంట దెబ్బ తిని ఎకరాకు 2, 3 క్వింటాలు దిగుబడులు మాత్రమే వచ్చాయి. పైగా ధరలు కూడా తగ్గాయి. క్వింటాలు రూ.6,000 పడిపోయింది. అయినా కొనేవారు కరువయ్యారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల మండలంలో అన్ని పంటలు దెబ్బతింటే అధికారులు పొలాలు వచ్చి సాగు చేసి, నష్ట పోయిన పంటలను చూసిన పాపాన పోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Updated Date - 2022-01-26T04:48:26+05:30 IST