Abn logo
Oct 22 2021 @ 00:33AM

ఎస్‌ కొత్తపల్లి చెరువులో చేపలు మృతి

ఓబుళదేవరచెరువు ,  అక్టోబరు  21 :  మండలంలోని శ్రీరా ముల కొత్తపల్లి చెరువులో గురువారం చేపలు మృతి చెందినట్లు ఆ గ్రామస్థులు గుర్తించారు. అయితే చెరువులో చేపలు ఎవరూ వదల లేదని, ఆ చేపలు ఎక్కడ నుంచి వచ్చాయన్న అనుమానాన్ని గ్రామస్థులు వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా చెరువులో చనిపోయిన చేపలను వదిలి వెళ్ళారా అన్న అనుమానాలు కూడా గ్రామస్థులు వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు చెరువులో పిడుగు పడటంతో చేపలు మృతి చెందాయా అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ చెరువులో ఓ ట్రాక్టర్‌ చేపలు మృతి చెంది చెరువులో నీటిపై తేలుతున్నాయి.