ఏపీలో ఉపాధిగా మారిన వరదలు

ABN , First Publish Date - 2021-12-16T23:32:44+05:30 IST

ఏపీలో ఇటీవల పోటెత్తిన వరదలు కొంతమందికి ఉపాధిగా మారాయి. వరదలతో చెరువులు, నదులు, కుంటలు నిండు కుండలను...

ఏపీలో ఉపాధిగా మారిన వరదలు

నెల్లూరు: ఏపీలో ఇటీవల పోటెత్తిన వరదలు కొంతమందికి ఉపాధిగా మారాయి. వరదలతో చెరువులు, నదులు, కుంటలు నిండు కుండలను తలపిస్తున్నాయి. అటు వరదలు పోటెత్తడంతో చేపలు కోకల్లలుగా వస్తున్నాయి. ఎక్కడ చూసినా చేపలే చేపలు. నెల్లూరులో వరదల కారణంగా పెన్నా నదిలో పెద్ద ఎత్తున చేపలు దొరుకుతున్నాయి. వ్యాపారాలు, కూలి పనులు లేక అల్లాడుతున్న వారంతా పెన్నా నదిలో చేపలు పడుతూ కొత్త ఉపాధి పొందుతున్నారు. కిలో చేపలు కారుచౌకగా రూ. 50 నుంచి 80 రూపాయలకు దొరుకుతుండటంతో స్థానికులు ఎగబడి మరీ వాటిని కొంటున్నారు. దీంతో పెన్నా నదీ పరిసర ప్రాంతాలు జనంతో సందడిగా మారాయి. 

Updated Date - 2021-12-16T23:32:44+05:30 IST