ముంబై : భారత్‌లో ‘క్రిప్టో’కు ఆకర్షణ తక్కువేనని ఫిన్‌టెక్ సంస్థ ఎఫ్ఐఎస్ పేర్కొంది. కిందటి నెలాఖరు(మార్చి 31) నాటికి... పలువురు చిన్న పెట్టుబడిదారులు తమ పోర్ట్‌ఫోలియోలను ఆఫ్‌లోడ్ చేసి ఉంటారని, అయితే కొంతమంది పెద్ద పెట్టుబడిదారులు మాత్రం ట్రేడింగ్‌ను కొనసాగించవచ్చని కంపెనీ తెలిపింది. గ్లోబల్ ఫిన్‌టెక్ సంస్థ ఎఫ్ఐఎస్... ఈ రోజు(ఏప్రిల్ 1) నుండి అమల్లోకి వచ్చిన కొత్త నియమాలతో భారత్‌లో ఒక అసెట్ క్లాస్‌గా క్రిప్టోకరెన్సీ తక్కువ ఆకర్షణీయంగా మారిందని తెలిపింది.
క్రిప్టో పన్నుపై కొత్త నియమాలు ఈ రోజు నుండి అమల్లోకి రావడంతో... వాటాదారులు, ఎక్స్ఛేంజీలు, ప్రత్యేకించి... చిన్న పెట్టుబడిదారులు పెద్దఎత్తున క్రిప్టో ఆస్తులను విక్రయిస్తున్నట్లు చెబుతున్నారు. ఫిన్‌టెక్ సంస్థ... ఒక ప్రకటనలో... ‘ప్రస్తుత చట్టాల ప్రకారం... క్రిప్టో ఒక అసెట్ క్లాస్‌గా భారత్‌లో తక్కువ ఆకర్షణీయంగా మారింది. మార్చి 31 నాటికి చాలా మంది చిన్న పెట్టుబడిదారులు తమ పోర్ట్‌ఫోలియోలను ఆఫ్‌లోడ్ చేసి ఉంటారు. కాగా... కొంతమంది పెద్ద పెట్టుబడిదారులు ఇప్పటికీ ట్రేడింగ్‌ను కొనసాగించవచ్చు’నని కంపెనీ తెలిపింది.
‘వర్చువల్ డిజిటల్ ఆస్తుల కోసం ప్రకటించిన పన్ను విధానం ప్రకారం ప్రస్తుత హోల్డర్లు, పెట్టుబడిదారులు విక్రయించాలనే ఏకాభిప్రాయముంది. అయినప్పటికీ, ఇప్పటికే 30 శాతం పన్ను శ్లాబులో ఉన్న హెచ్‌ఎన్‌డబ్ల్యూ పెట్టుబడిదారులు ఈ దృష్టాంతాన్ని కొద్దిగా భిన్నంగా చూస్తున్నారు. డబ్ల్యూఈబీ3 డిజిటల్ ఎకానమీలో పాల్గొనడం ద్వారా క్రిప్టోను పొందే హోల్డర్ల విభాగం పెరుగుతోందని, వారు తమ క్రిప్టో హోల్డింగ్లను ఎలా నిర్వహించాలనే దానిపై దీర్ఘకాలిక వ్యూహాలను రూపొందించాల్సిన అవసరముందని నిపుణులు పేర్కొంటున్నారు.
ఇవి కూడా చదవండి