Abn logo
May 30 2020 @ 22:50PM

పుట్టినరోజు సందర్భంగా...

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో తాజాగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ‘సింహా’, ‘లెజెండ్‌’ విజయాల తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తున్న చిత్రం కావడం, ఇందులో అఘోరా వేషధారణలో కథానాయకుడు కనిపించనున్నారనే సమాచారం సినిమాపై అంచనాలు పెంచాయి. దీనికి ‘మోనార్క్‌’ టైటిల్‌ పరిశీలనలో ఉందనీ, దాదాపుగా ఆ టైటిల్‌ ఖరారు చేయవచ్చనీ వినికిడి. లాక్‌డౌన్‌ కారణంగా ఈ చిత్రీకరణకు అంతరాయం ఏర్పడింది. అయితే, త్వరలో నందమూరి అభిమానులకు బోయపాటి కానుక ఇవ్వనున్నారని తెలిసింది. జూన్‌ 10న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్‌ లుక్‌ విడుదల చేయాలని ఆయన అనుకుంటున్నారట. బహుశా... టైటిల్‌ కూడా ఆ రోజే ప్రకటిస్తారేమో? ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Advertisement
Advertisement
Advertisement