కరోనాకు తొలి స్వదేశీ న్యుమోకోకల్‌ వ్యాక్సిన్‌

ABN , First Publish Date - 2020-07-16T07:28:57+05:30 IST

కరోనా వైర్‌సకు వ్యాక్సిన్‌ కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో వైరస్‌ ప్రధానంగా ప్రభావం చూపే ఊపిరితిత్తుల వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తొలి స్వదేశీ వ్యాక్సిన్‌ రెడీ అయింది...

కరోనాకు తొలి స్వదేశీ న్యుమోకోకల్‌ వ్యాక్సిన్‌

  • దీంతో ఊపిరితిత్తుల సమస్యకు చెక్‌
  • టీకాకు ఆమోదం తెలిపిన డీజీసీఏ

న్యూఢిల్లీ, జూలై 15: కరోనా వైర్‌సకు వ్యాక్సిన్‌ కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో వైరస్‌ ప్రధానంగా ప్రభావం చూపే ఊపిరితిత్తుల వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తొలి స్వదేశీ వ్యాక్సిన్‌ రెడీ అయింది. పుణెకు చెందిన సెరమ్‌ ఇనిస్టిట్యూట్‌ పూర్తి స్వదేశీయంగా తయారు చేసిన ‘న్యుమోకోకల్‌ పాలిసచారైడ్‌ కొంజుకేట్‌ వ్యాక్సిన్‌’కు డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీజీసీఏ) బుధవారం ఆమోదం తెలిపింది. కొవిడ్‌కు సబ్‌ వ్యాక్సిన్‌గా భావిస్తున్న ఈ ‘న్యుమోనికోకల్‌’ న్యుమోనియా, ఇతర ఊపిరితిత్తుల సమస్యలపై పోరాడుతుంది. పైగా ఇది తక్కువ ధరకే లభిస్తుందని తయారీదారులు వెల్లడించారు. సెరమ్‌ ఇనిస్టిట్యూట్‌ తయారు చేసిన ఈ వ్యాక్సిన్‌ గతేడాది డిసెంబరులోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అర్హత పొందింది. తాజాగా డీజీసీఏ ఆమోదం కూడా దక్కడంతో ఈ నెలాఖరుకు దీన్ని మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Updated Date - 2020-07-16T07:28:57+05:30 IST