తొలి ప్రపంచ టెస్టు చాంపియన్‌షి‌ప్ మ్యాచ్‎కు వాన గండం..!

ABN , First Publish Date - 2021-06-18T18:15:55+05:30 IST

144 ఏళ్ల టెస్టు క్రికెట్‌ చరిత్రను సమున్నత స్థాయిలో నిలిపేందుకు భారత్‌-న్యూజిలాండ్‌ జట్లు సిద్ధమయ్యాయి. క్రికెట్‌ ప్రపంచానికి సరికొత్త అనుభవమైన తొలి

తొలి ప్రపంచ టెస్టు చాంపియన్‌షి‌ప్ మ్యాచ్‎కు వాన గండం..!

సౌతాంప్టన్‌: 144 ఏళ్ల టెస్టు క్రికెట్‌ చరిత్రను సమున్నత స్థాయిలో నిలిపేందుకు భారత్‌-న్యూజిలాండ్‌ జట్లు సిద్ధమయ్యాయి. క్రికెట్‌ ప్రపంచానికి సరికొత్త అనుభవమైన తొలి ప్రపంచ టెస్టు చాంపియన్‌షి‌ప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో శుక్రవారం నుంచి తలపడబోతున్నాయి. ఇందుకు స్థానిక ఏజెస్‌ బౌల్‌ వేదిక కానుంది. రెండేళ్ల నుంచి ప్రత్యర్థులపై అద్భుత పోరాటంతో గెలుస్తూ.. డబ్ల్యూటీసీ ఫైనల్‌ దాకా చేరిన వేళ ఈ ఆఖరి సమరంలో అమీతుమీ తేల్చుకోనున్నాయి. కోహ్లీ సేన ఆధ్వర్యంలోనూ తొలి ఐసీసీ ట్రోఫీ కోసం భారత్‌ ఎదురుచూస్తోంది.


మ్యాచ్‎కు వాన గండం

ఈ టెస్ట్ చాంఫియన్ షిప్ ఫైనల్ మ్యాచ్‎కు వరుణుడు అడ్డు వచ్చేలా ఉన్నాడు. సౌతాంప్టన్‎లో ఓ మోస్తార్ నుంచి భారీ వర్షం కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో మ్యాచ్ జరుగుతుందా లేదా అనే సందేహం ఏర్పడుతోంది. వర్షం పడకపోయినా..మ్యాచ్ జరుగుతున్న సమయంలో పదేపదే చిరుజల్లులతో టెస్టు మ్యాచ్ కు అంతరాయం కలిగే అవకాశం కన్పిస్తోంది.


సౌతాంప్టన్‎లో 91 శాతం వర్షం పడే చాన్స్ ఉందని వివిధ వాతావరణ సమాచార వెబ్ సైట్లు తెలుపుతున్నాయి. శుక్రవారం మొత్తం ఆకాశంలో మబ్బులు కమ్ముకునే అవకాశం ఉంది. అలాగే ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడే ఆస్కారం ఉంది. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు వర్షం పడే అవకాశాలు ఉన్నాయని బ్రిటన్ వాతావరణశాఖ తెలిపింది. దీంతో అభిమానుల్లో మ్యాచ్ జరుగుతుందో లేదో అనే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి వరకు సౌతాంప్టన్ లో వాతావరణం ఎలా ఉందో ఐసీసీ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. 



Updated Date - 2021-06-18T18:15:55+05:30 IST