తొలుత వైద్య సిబ్బందికి..

ABN , First Publish Date - 2020-11-29T05:14:43+05:30 IST

కరోనా కట్టడికి త్వరలోనే వ్యాక్సిన రానుందన్న చర్చ ఇప్పటికే విస్తృతంగా జరుగుతోంది. వ్యాక్సిన వచ్చేసరికి సిద్ధంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు రావడంతో.. అక్కడి నుంచి అన్ని జిల్లాలకు ఈ సమాచారం అందించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఏర్పాట్లు ఊపందుకున్నాయి.

తొలుత వైద్య సిబ్బందికి..
కరోనా వ్యాక్సిన

 కరోనా వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు అధికారుల ప్రణాళిక

తొలి విడతగా 14,600 మందికి వ్యాక్సిన 

ప్రభుత్వానికి నివేదిక 

(రింగురోడ్డు) 

కరోనా కట్టడికి త్వరలోనే వ్యాక్సిన రానుందన్న చర్చ ఇప్పటికే విస్తృతంగా జరుగుతోంది. వ్యాక్సిన వచ్చేసరికి సిద్ధంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు రావడంతో.. అక్కడి నుంచి అన్ని జిల్లాలకు ఈ సమాచారం అందించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఏర్పాట్లు ఊపందుకున్నాయి. తొలి దశలో వైద్య సిబ్బందికి వ్యాక్సిన్‌ ఇవ్వాలని భావిస్తున్నారు. జిల్లా, ఏరియా ఆస్పత్రులు, సీహెచఎనసీ, పీహెచసీలు, స్త్రీశిశు సంక్షేమం, ప్రైవేటు ఆసుపత్రులు, ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులు, సిబ్బంది, ఆయుష్‌ విభాగం, ఆశావర్కర్లు, ఆశా సూపర్‌వైజర్లు, మల్టీపర్పస్‌ సూపర్‌వైజర్లు, హెల్త్‌వర్కర్లు, పారామెడికల్‌ సిబ్బంది అయిన ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, వార్డుబాయ్‌లు, శానిటరీ వర్కర్లు, డ్రైవర్లు, అంబులెన్స డ్రైవర్లు, క్లరికల్‌ సిబ్బందికి తొలి దశలో కరోనా వ్యాక్సిన ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. వీరు ఎంత మంది ఉన్నారన్న విషయమై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ జాబితాను సిద్ధం చేసింది. ఈ వివరాలను జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి డాక్టరు ఎస్‌వీ రమణకుమారి ఈ నెల 27న రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖకు నివేదించారు. మరోవైపు తొలి దశలో వ్యాక్సిన వేసేందుకు ఎంపిక చేసిన సిబ్బంది సమగ్ర వివరాలను సేకరించే పనిలో వైద్యఆరోగ్యశాఖ నిమగ్నమైంది. పానకార్డు, ఓటరు ఐడీ, ఆధార్‌కార్డు,  డ్రైవింగ్‌ లెసెన్సు, బ్యాంకు ఖాతా, చిరునామా, సెల్‌ నెంబరు తదితర వివరాలకు సంబంధించిన డేటాను సిద్ధం చేస్తున్నారు. ఈవిధంగా తొలి దశలో 14,600 మందికి కరోనా వ్యాక్సిన అందనుంది.

ప్రభుత్వానికి నివేదిక పంపాం 

కరోనా వ్యాక్సిన ఎవరికి ఇవ్వాలన్నదానిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో తొలి దశలో 14,600 మందికి వ్యాక్సిన అందనుంది. వైద్య, ఆరోగ్యకార్యకర్తలకు తొలి దశలో ఈ వ్యాక్సిన అందుతుంది. తరువాత దశలో పోలీసు సిబ్బంది, 60 ఏళ్ల పైబడిన వృద్ధులకు వ్యాక్సిన   ఇచ్చేందుకు ప్రభుత్వం నిర ్ణయించింది. అనంతరం సాధారణ ప్రజలకు టీకా అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేశాం. 

     - డాక్టరు ఎస్‌వీ రమణకుమారి, డీఎంహెచవో


Updated Date - 2020-11-29T05:14:43+05:30 IST