ఉచిత రిజిస్ట్రేషన్లపైనే తొలి సంతకం: కళా

ABN , First Publish Date - 2021-11-26T09:43:33+05:30 IST

ఉచిత రిజిస్ట్రేషన్లపైనే తొలి సంతకం: కళా

ఉచిత రిజిస్ట్రేషన్లపైనే తొలి సంతకం: కళా

లావేరు, నవంబరు 25: ‘‘టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచితంగా గృహ రిజిస్ట్రేషన్‌ పత్రాలు అందిస్తాం. అందుకు సంబంధించిన ఫైల్‌పైనే సీఎంగా చంద్రబాబు తొలి సంతకం చేస్తారు’’ అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకటరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా లావేరులో ఆయన విలేకర్లతో మాట్లాడారు. పేదలు కట్టుకున్న ఇంటికి రూపాయికే రిజిస్ట్రేషన్‌ చేస్తామని చెప్పి... ఇప్పుడు ఓటీఎస్‌ పేరుతో దోపిడీకి దిగడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. 

Updated Date - 2021-11-26T09:43:33+05:30 IST