అంతరిక్షానికి తొలి సౌదీ మహిళా వ్యోమగామి

ABN , First Publish Date - 2022-09-23T07:41:48+05:30 IST

మహిళలు కార్లు నడపడంపై ఉన్న నిషేధాన్ని నాలుగేళ్ల క్రితం ఎత్తివేసిన సౌదీ అరేబియా మరో అడుగు ముందుకేసింది. వచ్చే ఏడాది తొలిసారిగా

అంతరిక్షానికి తొలి సౌదీ మహిళా వ్యోమగామి

దుబాయ్‌, సెప్టెంబరు 22: మహిళలు కార్లు నడపడంపై ఉన్న నిషేధాన్ని నాలుగేళ్ల క్రితం ఎత్తివేసిన సౌదీ అరేబియా మరో అడుగు ముందుకేసింది. వచ్చే ఏడాది తొలిసారిగా ఓ మహిళా వ్యోమగామిని అంతరిక్షానికి పంపాలని నిర్ణయించింది. మరికొందరు పురుష వ్యోమగాములతోపాటు ఆమె కూడా అంతరిక్షానికి వెళతారు. దీని కోసం శిక్షణ కార్యక్రమాన్ని సౌదీ స్పేస్‌ కమిషన్‌ ప్రారంభించింది. దేశ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించాలని, ఇతర రంగాల్లో కూడా రాణించాలన్న విజన్‌-2030 ప్రణాళికలో ఓ భాగం. దీనిపై సౌదీ రాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు.  

Updated Date - 2022-09-23T07:41:48+05:30 IST