ఫస్ట్‌ ర్యాంక్‌ ప్రణీత

ABN , First Publish Date - 2022-05-22T06:51:10+05:30 IST

స్కీమ్‌ ఫర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషన ఫర్‌ స్టూడెంట్‌ ఇన హైస్కూల్స్‌ ఇన టార్గెటెడ్‌ ఏరియాస్‌ (శ్రేష్ట) ప్రవేశ పరీక్షల్లో జిల్లా విద్యార్థి ప్రణీతకు జా తీయ స్థాయిలో మొదటి ర్యాంకు వచ్చింది. మే 7న శ్రేష్ట ప్రవేశ పరీక్షలు నిర్వహించారు

ఫస్ట్‌ ర్యాంక్‌ ప్రణీత

శ్రేష్ట పరీక్షల్లో జాతీయ స్థాయి ఘనత

అనంతపురం సెంట్రల్‌/క్లాక్‌టవర్‌, మే 21: స్కీమ్‌ ఫర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషన ఫర్‌ స్టూడెంట్‌ ఇన హైస్కూల్స్‌ ఇన టార్గెటెడ్‌ ఏరియాస్‌ (శ్రేష్ట) ప్రవేశ పరీక్షల్లో జిల్లా విద్యార్థి  ప్రణీతకు జా తీయ స్థాయిలో మొదటి ర్యాంకు వచ్చింది. మే 7న శ్రేష్ట ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. ఎస్కే యూనివర్సిటీ సమీపంలోని ఆకుతోటపల్లి గ్రామానికి చెందిన గంగప్ప, నాగవేణి దంపతుల కూతురు ప్రణీత, 9వ తరగతిలో ప్రవేశానికి పరీక్ష రాసింది. జాతీయ స్థాయిలో ప్రథమ ర్యాంకును సాధించి అనంత ప్రతిభను చాటింది. అనంతపురం నగర సమీపంలోని మాంటిస్సోరి పాఠశాలలో ప్రణీత 8వ తరగతి వరకు చదివింది. విద్యార్థిని తండ్రి గంగప్ప ఆర్డీటీ ఉద్యోగి. తల్లి నాగవేణి గృహిణి. దేశంలోని అత్యుత్తమ ప్రైవేట్‌ పాఠశాలల్లో ప్రతిభావంతులైన ఎస్సీ బాల, బాలికలకు సీట్లు కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం శ్రేష్ట పథకాన్ని ప్రవేశపెట్టింది. ఎస్సీ విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యనందించడమే లక్ష్యంగా ఈ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఈ పథకం ద్వారా ప్రతి సంవత్సరం 9, 11వ తరగతుల ప్రవేశాలకు దాదాపు 3వేల మందిని ఎంపిక చేస్తున్నారు. 


కలెక్టర్‌ కావడమే లక్ష్యం...

కలెక్టర్‌ కావడమే నా లక్ష్యం. గ్రామీణ ప్రాంత పేదలకు సేవ చేసేందుకు కలెక్టర్‌ కావాలని నిర్ణయించుకున్నాను. 9వ తరగతి ప్రవేశాలకు నిర్వహించిన శ్రేష్ట పరీక్షల్లో జాతీయస్థాయి మొదటి ర్యాంకు రావడం ఆనందంగా ఉంది. ఆర్డీటీ సహకారం, అమ్మానాన్న ప్రోత్సాహంతోనే ర్యాంకును సాధించగలిగాను.

- ప్రణీత

Updated Date - 2022-05-22T06:51:10+05:30 IST